relationship: రిలేషన్స్ ఎక్కువ కాలం నిలవడం ప్రస్తుతం కాలంలో కష్టమే. ఎందుకంటే మారుతున్న పరిస్థితుల కారణంగా ఎలాంటి రిలేషన్ షిప్ నైనా వదులుకోవడానికి వెనకాడటం లేదు జనాలు. బంధాలు బలంగా ఉండాలంటే కొన్ని టిప్స్ ను పాటిస్తే సరి. మీ రిలేషన్ లో ఎలాంటి గొడవలొచ్చినా.. అస్సలు విడిపోరు. అవేంటో తెలుసుకుందాం పదండి.
అంచనాలొద్దు: ప్రతి ఒక్కరూ తమ లైఫ్ పార్టనర్ విషయంలో కొన్ని ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఒకవేళ తమ భాగస్వాములు వీరు అంచనా వేసినట్టుగా లేకపోతే .. ఇద్దరి మధ్యన ఎన్నో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి లైఫ్ పార్టనర్ విషయంలో ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోకండి.
కలిసి పని చేయండి: ఇద్దరి మధ్యన ఎలాంటి గొడవలు రాకూడదన్నా, ఇద్దరి మధ్య బాడింగ్ పెరగాలన్నా.. కలిసి పనిచేయడం ఎంతో ముఖ్యం. కలిసి వంట చేయడం, బయటకు వెల్లడం, టూర్ వెళ్లడం, ఆటలు ఆడటం చేస్తూ ఉంటే మీ బందం బలపడుతుంది.
నో ఫోన్ పాలసీ: ఫోన్ వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో.. అంతకు మించి నష్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకుని .. ఫోన్ కు దూరంగా ఉండండి. ఫోన్ పక్కన పెట్టేసి ఎక్కువ సమయం మీ భాగస్వామితో గడపండి. మంచిగా ఒక సోఫాలో కూర్చొని ఏదైనా మాట్లాడుకోండి. అంతేకాని చెరో పక్క చూర్చుని ఇన్ స్టా, ఫేస్ బుక్ చూసే ఏం ఉపయోగం లేదు.
రెస్పెక్ట్: ఏ బంధంలో అయినా రెస్పెక్ట్ ఎంతో ముఖ్యం. అయితే కేవలం మీ లైఫ్ పార్టనర్ కు మాత్రమే రెస్పెక్ట్ ఇవ్వడమే కాదు.. ఇరు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, వారి ఛాయిస్ కు కూడా గౌరవమివ్వాలి. అప్పుడే ఒకరిపై ఒకరికి రెస్పెక్ట్, ప్రేమ పెరుగుతుంది.
సారీకి సిగ్గొద్దు: రిలేషన్ షిప్ లో గొడవలు, మనస్పర్థలు, చిన్న చిన్న కలతలు రావడం సహజమే. మీరే ఒక మెట్టు దిగి మీ పార్టనర్ కు క్షమాపణలు చెప్పండి. మీ పార్టనర్ ఎంతో సంతోషిస్తూ. దీనివల్ల మీ పార్టనర్ కు మీపై ప్రేమ పెరుగుతుంది. కానీ గొడవలు పడ్డప్పుడు చాలా మంది ఈగోతో తమ పార్టనర్ కు సారీ చెప్పడానికి అస్సలు ఇష్టపడరు. ఈగో తో సారీ చెప్పకపోతే మీ సమస్య మరింత కాంప్లికేట్ అవుతుంది.