Diet For Piles: పైల్స్ తో బాధపడేవారు కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే ఆ సమస్య కొంత వరకు తగ్గుతుంది. ముఖ్యంగా దురద, రక్తస్రావం వంటి సమస్యలను తగ్గించడానికి ఫైబర్ ఎక్కువగా ఉంటే ఆహారాలు ఎంతో సహాయపడతాయి. తీసుకునే ఎంత ఆహారం మంచిదైతే.. ఈ సమస్య నుంచి అంత తొందరగా బయటపడొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Diet For Piles: ప్రస్తుత కాలంలో పైల్స్ (Piles) సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. ఈ సమస్యకు అసలు కారణం మనం తీసుకునే ఆహారమేనని తేల్చి చెబుతున్నారు నిపుణులు. ఈ పైల్స్ సమస్యతో బాధపడేవారికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు ఎంతో మేలు చేస్తాయట.
210
హీమోరాయిడ్లు, పైల్స్ Rectum లోపల, పాయువు (Anal) చుట్టూరా Inflamed blood vessels ఉంటాయి. ఈ పైల్స్ వల్ల కొంత మందికి తీవ్రమైన ఇబ్బంది కలగపోయినప్పటికీ, మరికొంతమందికి మాత్రం తీవ్రమైన రక్తస్రావం, దురద వంటి సమస్యలు ఎదురవుతుంటాయి.
310
piles
పైల్స్ సమస్య తీవ్రతరం అయినప్పుడు వైద్యుడిని సంప్రదించకుండా చాలా మంది ఉంటారు. దీని వల్ల సమస్య మరింత ఎక్కువవుతుంది కానీ తగ్గదు. ఈ పైల్స్ సమస్య బారిని పడిన వారు ఎక్కువగా 50 ఏండ్లు పైబడిన వారేనని సర్వేలు చెబుతున్నాయి.
410
fiber
ఈ పైల్స్ తో బాధపడేవారు ఖచ్చితంగా ఫైబర్ ఫుడ్ ను తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఫైబర్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల Rectum చివర్లను మృదువుగా చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తద్వారా బాడీలో ఉండే వ్యర్థ పదార్థాలను బయటకు పంపే ప్రక్రియ సులువు అవుతుంది.
510
పైల్స్ సమస్య ఉన్న వారు తప్పకుండా నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండాలి. అలాగే తాజా పండ్లను కూడా తింటూ ఉండాలి. ఇవి చాలా ముఖ్యం. ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలు పైల్స్ సమస్యను మరింత పెంచుతాయి. అంతేకాదు ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉండే ఆహారాలు మలబద్దకం సమస్యను మరింత పెంచుతాయి. అంతేకాదు ఇవి పైల్స్ సమస్యను ప్రేరేపిస్తాయి.
610
కాబట్టి పైల్స్ ఉన్న వారు ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉండే ఆహారాలను తినకండి. పాలు, పెరుగు, పాల ఉత్పత్తులను తగ్గించండి. వీటిలో ఫైబర్ కంటెంట్ తక్కువ మొత్తంలో ఉంటుంది. వీటిని తింటే జీర్ణం తొందరగా అవదు.
710
వేయించిన ఆహారాలను దూరంగా ఉండండి. వీటిని తింటే మీ జీర్ణవ్యవస్థ పాడవుతుంది. కాబట్టి ఫ్రై చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండటమే బెటర్.
810
చిక్కుళ్లు, బార్లీ, ఓట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్ లో ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. వీటిని మీ రోజు ఆహారంలో చేర్చుకుంటే పైల్స్ ప్రాబ్లమ్ తగ్గుతుంది.
910
క్యాబేజీ, బ్రోకలి, గుమ్మడి కాయ, కాలీఫ్లవర్, బెల్ పెప్పర్స్, కాలే, గుమ్మడి గింజలు, తాజా కూరగాయలు, దోసకాయం వంటివి మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
1010
Fruits
అరటి, పుచ్చకాయ, ప్రూనే, ఆపిల్, పియర్ పండ్లను తరచుగా తింటూ ఉండండి. ఇవి మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. మలబద్దకం సమస్య నుంచి బయటపడాలంటే ఫైబర్ ఆహారంతో పాటుగా హైడ్రేటెడ్ గా కూడా ఉండాలి.