ఫ్రిజ్ లో ఏ వస్తువులను ఎక్కడ పెట్టాలో తెలుసా?

First Published | Aug 30, 2024, 4:40 PM IST

మనలో చాలామంది సరుకులన్నీ ఒకేసారి కొనేసి ఫ్రిడ్జ్ నిండా నింపేస్తాం. దీనివల్ల చాలా  ఆహార పదార్థాలు ఎక్కువగా పాడైపోతుంటాయి. కానీ వేస్ట్ కాకుండా.. ఆహార పదార్థాలు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

ఫ్రిడ్జ్ ని ఎలా వాడాలో తెలుసా?

చాలా మంది ఫ్రిజ్ ఖాళీగా ఉండని ఏవి పడితే అవి కొనేసి.. ఫ్రిజ్ నిండా నింపేస్తుంటారు. అవి ఫ్రిజ్ లో పెట్టాల్సినవి కాకపోయినా పెట్టేస్తుంటారు. కానీ దీనివల్ల ఫ్రిజ్ లో ఖాళీ స్పేస్ లేకుండా పోవడమే కాకుండా.. కరెంట్ బిల్లు కూడా విపరీతంగా వస్తుంది. మీకు ఏవైతే అవసరమున్నాయో వాటిని ఒక లీస్ట్ తయారుచేసి వాటిని మాత్రమే కొనండి. ఏవి పడితే అవి కొనడం వల్ల మీ సమయం, డబ్బు రెండూ వృధా అవుతాయి. 

ఫ్రిడ్జ్ చిట్కాలు

మనలో చాలామంది వంట సామాగ్రిని ఒకేసారి అంటె నెల లేదా వారం పది రోజులు వచ్చే వరక సరుకులను కొంటుంటారు. ఇవి పాడవకూడదని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు. అవసరమున్నప్పుడు బయటకు తీసి వాడుతుంటారు. కానీ చాలా మంది ఫ్రిజ్ లో ఏం పెట్టారో కూడా మర్చిపోతుంటారు. దీనివల్ల అవి పాడైపోతుంటాయి. అందుకే  ఫ్రిడ్జ్ లో పెట్టిన వాటిని, వాటి తేదీని ఒక లేబుల్ పై రాసి అతికించండి. దీనివల్ల మీరు వాటిని మర్చిపోరు. 


ఫ్రిడ్జ్ నిల్వ చిట్కాలు

చాలా మందికి ఫ్రిజ్ ను వాడటమే తప్ప.. ఏ వస్తువులను ఎక్కడ పెట్టాలో మాత్రం తెలియదు. వండిన, వండని ఆహార పదార్థాలన్నింటినీ కలిపి ఒకేదగ్గర పెట్టేస్తుంటారు. కానీ ఇలా అస్సలు పెట్టకూడదు. వండని, వండిని వాటిని ఎప్పుడూ కూడా వేర్వేరుగానే పెట్టాలి. అప్పుడే అవి పాడవకుండా ఉంటాయి. 

ఫ్రిడ్జ్ ఆర్గనైజర్లు

ఫ్రిడ్జ్ లో వస్తువులను సరిగ్గా ఉంచడానికి ఆర్గనైజర్లను ఉపయోగించండి. ప్రతి వస్తువుని ఉంచడానికి ప్రత్యేకమైన కంటైనర్లు, ఆర్గనైజర్లు ఉపయోగిస్తేనే బెటర్. దీనివల్ల మీ ఫ్రిడ్జ్ శుభ్రంగా ఉండటమే కాకుండా.. ఏ వస్తువు ఎక్కడ ఉందో కూడా మీకు తేలికగా అర్థమవుతుంది.

ఫ్రిడ్జ్ నిర్వహణ

వివిధ రకాల ఆహార పదార్థాల కోసం ఫ్రిడ్జ్ లో వేర్వేరు విభాగాలను ఏర్పాటు చేసుకోండి. ఇది మీ ఫ్రిడ్జ్‌ నీట్ గా, చక్కగా కనిపించేలా చేస్తుంది. అలాగే ఆహార కాలుష్యాన్ని నివారించడానికి కూడా సహాయపడుతుంది. దీని ప్రకారం కంటైనర్లు, ఆర్గనైజర్లను కొనుగోలు చేయండి.

ఫ్రిడ్జ్ శుభ్రత

చాలా మంది ఫ్రిజ్ ను క్లీన్ చేయడమే మర్చిపోతుంటారు. దీనివల్ల ఫ్రిజ్ లో దుర్వాసన రావడమే కాకుండా.. దాంట్లో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి. దీంతో ఫ్రిజ్ లో పెట్టిన ఆహారాలు చాలా త్వరగా పాడవుతాయి. అందుకే ఎప్పటికప్పుడు మీ ఫ్రిడ్జ్‌ని క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. నెలకు రెండుసార్లు ఫ్రిడ్జ్‌ని శుభ్రం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది దుర్వాసన, బ్యాక్టీరియా రాకుండా చేయడానికి సహాయపడుతుంది.

Latest Videos

click me!