అంబానీ ఫ్యామిలీకి మేకప్ వేసేది ఇతనే.. ఒక్కసారి మేకప్ వేయడానికి ఎంత తీసుకుంటాడో తెలుసా?

First Published | Aug 30, 2024, 3:58 PM IST

ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ, కూతురు ఇషా అంబానీ కోడలు శ్లోక్ మెహతా అంబానీల మేకప్ ఆర్టిస్ట్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంకోటి.. ఈయన ఒక్కసారి మేకప్ వేయడానికి ఎంత వసూలు చేస్తాడో తెలుసా? 

భారతీయ బిలియనీర్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ విజయవంతమైన మహిళల్లో ఒకరన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈమె 60 ఏండ్ల వయసులో కూడా ఎంతో స్టైలీష్ గా ఉంటారు. అందుకే ఈమే స్టైలిష్ వ్యాపారవేత్తలలో ఒకరుగా నిలిచారు. అసలు ఈమె వయసు 60 ఏండ్లు అంటే ఎవరూ నమ్మరు. ఎందుకంటే నీతా అంబానీ ఎప్పటిలాగే అందంగా, ఫిట్‌గా కనిపిస్తుంది. అది ఏ సందర్భమైనా సరే నీతా అంబానీ తనకంటూ ఒక స్టైల్ ను మెయింటైన్ చేస్తుంటుంది. ఈమె దరించే దుస్తులు, ఆభరణాలు ఎంత అందంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లిలో కూడా నీతా అంబానీ ఎంతో బ్యూటీఫుల్ గా కనిపించింది. ఈమె ఒక్కతే కాదు  నీతా అంబానీ పెద్ద కోడలు శ్లోకా అంబానీ, కూతురు ఈశా అంబానీ ల లుక్ కూడా వావ్ అనిపించింది. వీళ్లు ఏ ఈవెంట్ లో పాల్గొన్న ఎంతో స్పెషల్ గా నిలుస్తారు. అది దుస్తుల్లో అయినా సరే నగల్లో అయినా సరే. ముఖ్యంగా వీళ్లు చాలా సింపుల్  మేకప్ లో కూడా ఎంతో అందంగా కనిపిస్తారు. ఇందుకు రహస్య మేంటని ఎప్పుడైనా అనిపించిందా?  అంబానీ ఫ్యామిలీ ఆడ పడుచులు అందంగా కనిపించడానికి ఒక సీక్రేట్ ఉది. అదేంటో కాదు.. వారి మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ కాంట్రాక్టర్. 

నీతా మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ

మిక్కీ చాలా ఫేమస్ మేకప్ అర్టిస్ట్. ఈయనకు దాదాపు 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. అందుకే మిక్కీ కాంట్రాక్టర్ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన మేకప్ ఆర్టిస్టులలో ఒకరుగా మంచి గుర్తింపును పొందారు.బాలీవుడ్ ప్రముఖులలో ఎంతో ప్రముఖమైన, చాలా మంది ఇష్టపడే మేకప్ ఆర్టిస్ట్.. మిక్కీ కాంట్రాక్టర్. మిక్కీ కాంట్రాక్టర్ 1992లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ హీరోయిన్ కాజోల్  ఫస్ట్ మూవీ "బేఖుడి"తో ఈయన తన కెరీర్ ను ప్రారంభించారు. ఈ మూవీలో కాజోల్ ను దేవతలా అందంగా రెడీ చేశాడు మిక్కీ. ఆ తర్వాత బాలీవుడ్‌లో  ఈయన ఎన్నో మెగాహిట్ బ్లాక్‌బస్టర్ చిత్రాలకు పనిచేశారు.
 


ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ, కూతురు ఇషా అంబానీ, కోడలు శ్లోక మెహతా అందరికీ మిక్కీ కాంట్రాక్టరే మేకప్ ఆర్టిస్ట్. ఒక ఈవెంట్ కి లేదా ఒక సెషన్ కి ఈయన రూ.75 వేల నుంచి రూ.1 లక్ష వరకు తీసుకుంటారట. దీంతో ఆయన భారతదేశంలోనే అత్యంత ఖరీదైన మేకప్ ఆర్టిస్టుల్లో ఒకరిగా నిలిచారు.

బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొణే, కరీనా కపూర్, ఐశ్వర్య రాయ్, అనుష్క శర్మ, కాజోల్ వంటి అగ్ర హీరోయిన్లందరికీ మిక్కీ కాంట్రాక్టర్ మేకప్ ఆర్టిస్ట్ గా ఉన్నారు. "హమ్ ఆప్కే హై కౌన్", "దిల్ తో పాగల్ హై", "కుచ్ కుచ్ హోతా హై", "కల్ హో నా హో," "మై నేమ్ ఈజ్ ఖాన్" వంటి ఎన్నో బాలీవుడ్ చిత్రాలకు కూడా మిక్కీ పనిచేశారు.

Latest Videos

click me!