అండర్ ఆర్మ్స్ నల్లగా, అసహ్యంగా మారడానికి కారణాలు ఏంటో తెలుసా?

First Published Nov 14, 2021, 2:25 PM IST

అండర్ ఆర్మ్స్ (Under arms) నల్లగా, అసహ్యంగా మారడంతో మనకు చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. దీంతో చాలా మంది స్లీవ్ లెస్ డ్రెస్సులు (Sleeveless tops) వేసుకోవాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. దీంతో వారికి ఇష్టమైన డ్రెస్ వేసుకోలేరు. ఇప్పుడు అండర్ ఆర్మ్స్ నల్లగా మారడానికి అసలు కారణాలేంటో ఈ ఆర్టికల్ (Article) ద్వారా తెలుసుకుందాం..
 

అండర్ ఆర్మ్స్ లో షేవింగ్ (Shaving) చేసుకోరాదు. ఒకవేళ మీరు మీ అండర్ ఆర్మ్స్ ని రెగ్యులర్ గా షేవ్ చేసుకుంటూ ఉంటే చర్మం తన సున్నితత్వాన్ని కోల్పోతుంది. సెన్సిటివ్ స్కిన్ ప్రదేశాలలో ఎక్కువగా షేవింగ్ చేయరాదు. షేవింగ్ అనేది సెన్సిటివ్ స్కిన్ పై దుష్ర్పభావం చూపుతుంది. దాంతో చర్మం తన మృదుత్వాన్ని కోల్పోయి నల్లగా నిర్జీవంగా మారుతుంది. అండర్ ఆర్మ్స్ లో చర్మ సమస్యలు (Skin problems) ఏర్పడతాయి.
 

మన శరీరంలో హార్మోన్ లు (Hormones) సరిగ్గా పనిచేయకపోతే చర్మ సమస్యలు ఏర్పడతాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హార్మోన్లకు సంబంధించిన సమస్యలైన హైపోథైరాయిడిజం (Hypothyroidism) వంటివి సమస్యలు ఉన్నప్పుడు అండర్ ఆర్మ్స్ నల్లగా, అసహ్యంగా మారతాయి. దాంతో మనకు స్లీవ్ లెస్ డ్రస్సులను వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. 
 

స్నానం చేసిన వెంటనే అండర్ ఆర్మ్స్ (Under arms) ను తడిలేకుండా కాటన్ టవల్ తో శుభ్రపరచుకోవాలి. ఎక్కువసేపు అండర్ ఆర్మ్స్ తడి (Wet) గా ఉండడంతో అక్కడ చర్మ సమస్యలు ఏర్పడతాయి. ఈ కారణంగా ఆ ప్రదేశంలో దురద, మంటలు ఏర్పడతాయి. దురద, మంటలు తగ్గిన వాటి తాలూకు మచ్చలు అలాగే ఉండి అక్కడి చర్మం అసహ్యంగా నల్లగా మారిపోతుంది. అండర్ ఆర్మ్స్ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.
 

ఎక్కువ గాఢత గల డియోడరెంట్స్ (Deodorants) ను వాడరాదు. అండర్ ఆర్మ్స్ స్కిన్ పై చెడు ప్రభావం చూపుతాయి. వీటిలో ఉండే కెమికల్స్ కారణంగా  చర్మం దెబ్బతింటుంది. దాంతో చర్మం రంగు నల్లగా మారుతుంది. అండర్ ఆర్మ్స్ లో హెయిర్ తొలగించడం కోసం వ్యాక్సింగ్ (Waxing) సరైన పద్ధతిలో చేసుకోవాలి. ఎక్కువ ఫోర్ తో హెయిర్ రిమూవ్ చేస్తే అక్కడ చర్మ కణాలు దెబ్బతింటాయి. కనుక హెయిర్ రిమూవ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
 

శరీరంలోని ఇతర భాగాలతో పోలిస్తే అండర్ ఆర్మ్స్ లో చర్మం నల్లగా ఉంటుంది. దీనికి కారణం డయాబెటిస్ కూడా కావచ్చు. ఇన్సులిన్ సమస్యలు (Insulin problems) ఉన్నప్పుడు ఇలా శరీరంలో ఇతర భాగాల కంటే అండర్ ఆర్మ్స్ లో చర్మం నల్లగా అసహ్యంగా మారుతుంది. ఒకసారి మీరు ఇన్సులిన్ (Insulin) పరీక్ష చేసుకుంటే మంచిది.
 

అండర్ ఆర్మ్స్ కు చెమట (Sweats) ఎక్కువగా పట్టినప్పుడు అక్కడ మురికిగా పేరుకు పోతుంది. ఇలాంటి సమస్య ఉన్నవారు రెగ్యులర్ గా స్కిన్ ఎక్స్ ఫోలియేషన్ (Skin exfoliation) చేయాలి. అప్పుడే నల్లగా, అసహ్యంగా ఉండే అండర్ ఆర్మ్స్ సమస్యలను తగ్గించుకోవచ్చు.

click me!