నెలలో రెండుసార్లు పిరియడ్స్ వస్తున్నాయా.. అయితే దానికి కారణం ఏంటో ఇలా తెలుసుకోండి?

First Published Oct 31, 2021, 3:35 PM IST

సాధారణంగా మహిళల్లో రుతుక్రమం (Menses) 28 రోజులకు ఒకసారి వస్తుంది. అలాకాకుండా అకస్మాత్తుగా ఒక్కోసారి నెలలో రెండు సార్లు పిరియడ్ వస్తుంటుంది. దీనికి కారణం శరీరంలోని హార్మోన్ల (Hormones) బ్యాలెన్స్ సరిగా లేకపోవడం. ఈ ఆర్టికల్ ద్వారా ఒకే నెలలో రెండుసార్లు పీరియడ్ రావడానికి గల కారణాలు గురించి తెలుసుకుందాం..

చాలా మంది మహిళలు రుతుక్రమం సమయంలో ఇబ్బందులు పడుతుంటారు. కొందరి మహిళల్లో పీరియడ్స్ (Periods) క్రమంగా వస్తుంటాయి. మరికొందరి మహిళల్లో  యుక్తవయసు (Adulthod) నుంచి రెండుసార్లు వస్తుంటుంది. అది సమస్య కాదు. కానీ అకస్మాత్తుగా ఒకే నెలలో రెండు సార్లు పీరియడ్ వస్తుంటే డాక్టర్ను సంప్రదించడం మంచిది.
 

పిట్యూటరీ గ్రంధి (Pituitary gland), థైరాయిడ్ (Thyroid) సమస్యలు, గర్భనిరోధక మాత్రలు, యాంటీ డిప్రెషన్ మందులు వాడటం, పిసిఒడి, శక్తికి మించిన వ్యాయామం చేయడం, గర్భ సంబంధిత ఆపరేషన్లు ఇరెగ్యులర్ పీరియడ్స్ కి కారణం అవుతాయి. ఈ సమస్యలు రుతుక్రమంలో మహిళలకు ఇబ్బందిని కలిగిస్తాయి.
 

ఒత్తిడి: వారి కుటుంబ ఒత్తిడి, పని ఒత్తిడి ప్రభావంతో కూడా రుతుక్రమంలో మార్పులు వస్తుంటాయి. శరీరంలోని హార్మోన్లు (Hormones) ఒత్తిడికి గురికావడం ద్వారా ఒకే నెలలో రెండు సార్లు రక్తస్రావం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఒత్తిడి (Stress) మాత్రమే దీనికి ప్రధానంగా కారణమని చెప్పలేము. శరీరంలోని వేడి కారణంగా కూడా ఒక్కోసారి రెండుసార్లు వస్తుంది.
 

శరీర బరువులో మార్పులు: శరీర బరువులో పెరగడం, తగ్గడం వంటి మార్పులు వస్తే రుతుక్రమం సరిగ్గా రాకపోవడానికి కారణం కావచ్చు. కొందరి స్త్రీలలో రుతుస్రావం (Bleeding) ఎక్కువ రోజులు కావచ్చు, మరికొందరిలో తక్కువ కావచ్చు. ఇంకొందరిలో రెండు వారాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. దీనికి హార్మోన్ల (Hormones) అసమతుల్యతే కారణం.
 

థైరాయిడ్ సమస్య: థైరాయిడ్ సమస్య ఉన్నా ఒకే నెలలో రెండుసార్లు పీరియడ్ వస్తుంటుంది. థైరాయిడ్ ఫంక్షన్ పిరియడ్ లోని యోని స్రావంతో ముడిపడి ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి (Thyroid gland) నుంచి ప్రొజెస్టెరాన్ (Progesterone), ఈస్ట్రోజన్ (Estrogen) అని హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. థైరాయిడ్ సమస్యతో ఇర్రెగులర్ పీరియడ్స్ (Irregular periods) వస్తుంటాయి.
 

గర్భనిరోధక మాత్రలు: గర్భనిరోధక మాత్రలను వాడకం కూడా ఒకే నెలలో రెండుసార్లు పీరియడ్ రావడానికి కారణం అవుతుంది. కడుపులోని ఫైబ్రాయిడ్లు (Fibroids) రక్తం గడ్డకట్టడం, భారీ రక్తస్రావం జరగడానికి   కారణమవుతుంది. ఈ రక్తస్రావం ఇర్రెగులర్ పీరియడ్స్ (Irregular periods) కు కారణమవుతాయి.

click me!