వీపు మీద నల్ల మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించండి!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 30, 2021, 05:10 PM ISTUpdated : Oct 30, 2021, 05:12 PM IST

శరీరంలోని హార్మోన్ల (Hormones) అసమతుల్యత లోపంతో చర్మ సమస్యలు (Skin Problems) వస్తుంటాయి. అందులో ముఖం మీద ఏర్పడిన మచ్చలతో పాటు వీపు మీద వచ్చే నల్ల మచ్చలు ఎక్కువ ఇబ్బంది కలిగిస్తుంటాయి. కాబట్టి వీటిని సహజసిద్ధమైన పద్ధతిలో ఏ విధంగా తగ్గించుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.  

PREV
19
వీపు మీద నల్ల మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించండి!

శరీరానికి శుభ్రత (Cleanliness) అవసరం. మన శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా (Health) ఉంటాం. శరీర శుభ్రత మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రోజుకు రెండుసార్లు స్నానం చేయడం మంచిది. స్నానానికి గోరువెచ్చని నీటిని గాఢత తక్కువగా ఉండే షాంపూలను, సోపులను వాడడం మంచిది.
 

29

ఇలా చేస్తే చర్మ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అధిక చెమట, చుండ్రు (Dandruff), మొటిమల వల్ల (Pimples) వాటి తాలూకు ఇన్ఫెక్షన్ ద్వారా నల్ల మచ్చలు ఏర్పడతాయి. ఇలా వీపు మీద ఏర్పడిన నల్ల మచ్చలు  మనకు నచ్చిన డీప్ డ్రెస్సులను వేసుకోవడానికి ఇబ్బందిని కలిగిస్తాయి.
 

39

వీటిని తగ్గించుకోవడానికి ఆర్టిఫిషియల్  క్రీములు (Artificial creams) వాడకం తగ్గించాలి. ఆర్టిఫిషియల్ క్రీములు చర్మం యొక్క సహజ మృదుత్వాన్ని తగ్గిస్తాయి. కనుక ఇప్పుడు మనము ఇంటిలోనే సహజసిద్ధమైన పద్ధతులతో ఈ నల్ల మచ్చలను (Black sports) ఏ విధంగా తొలగించుకోవాలో తెలుసుకుందాం.
 

49

కొబ్బరి నూనె: కొబ్బరి నూనె (Coconut oil) మంచి ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. కొబ్బరినూనెను వీపు మీద నల్ల మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి అరగంట తర్వాత వేడి నీటితో స్నానం చేయాలి. ఇది పొడిబారిన పగిలిన చర్మం తాలూకు మచ్చలను (Sports) తగ్గిస్తుంది.
 

59

నిమ్మకాయ: నిమ్మకాయ (Lemon) చర్మంపై వచ్చే మచ్చలను తగ్గించడానికి మంచి ఔషధంగా (Medicine) పనిచేస్తుంది. ఇందులో విటమిన్ సి బ్లీచింగ్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇది చర్మ దురదలను తగ్గిస్తుంది. వీపు మీద దురద ఉన్న ప్రదేశంలో ఈ నిమ్మరసం రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
 

69

కలబంద: కలబందలో (Alovera) యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కలబంద గుజ్జును వీపు మీద నల్ల మచ్చలు ఉన్న ప్రదేశంలో అప్లై చేసి  అరగంట తర్వాత చల్లటి నీటితో స్నానం చేయాలి. కలబంద గుజ్జు ఇన్ఫెక్షన్ (Infection) తాలూకు మచ్చలను తగ్గించడానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.
 

79

కీరదోసకాయ: కీరదోసకాయ (Cucumber) శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. చర్మానికి తగినంత తేమను అందించి చర్మం పొడిబారకుండా చూస్తుంది. దోసకాయ గుజ్జును నల్ల మచ్చలు (Black sports) ఉన్న ప్రదేశంలో అప్లై చేసి అరగంట తరువాత చల్లటి నీటితో స్నానం చేయాలి.
 

89

టమోటో గుజ్జు : టమోటో గుజ్జు (Tomato Pulp) అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇందులో ఉండే అసిడిక్ (Acidic) లక్షణాలు నల్లమచ్చలను తగ్గిస్తాయి. టమోటా గుజ్జు వీపు మీద మచ్చలు ఉన్న ప్రదేశంలో అప్లై చేసి అరగంట తర్వాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
 

99

ఆరంజ్ తొక్కల పొడి: ఆరెంజ్ తొక్క పొడి (Orange Peel Powder) లో కొంచెం పసుప, (Turmeric) కొంచెం తేనె (Honey) కలిపి వీపు మీద నల్ల మచ్చలు ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచిది. ఆరెంజ్ తొక్క పొడి మచ్చలను తగ్గించడానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.

click me!

Recommended Stories