వెల్లుల్లి చేసే మేలు ఇంతా అంతా కాదు. వెల్లుల్లి రసం శరీరానికి వేడిని ఇవ్వడమే కాకుండా, ఆహారం రుచిని కూడా పెంచుతుంది. వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. సంప్రదాయ రసంలో వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర లాంటివి కలిపితే మంచి రుచి, వాసన వస్తాయి.
వెల్లుల్లి రసం తయారీ విధానం
వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఆ వెల్లుల్లిని మిరియాలు, జీలకర్రతో పాటు వేయించాలి. తర్వాత చింతపండు, టమాటా, పసుపు, ఉప్పు వేసి మరిగించి, వేయించిన వెల్లుల్లి మిశ్రమాన్ని కలపాలి. ఎక్కువసేపు మరిగించకుండా దించేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది.