డయాబెటిస్ ఉన్నవారు రంజాన్ లో ఈ చిట్కాలు పాటిస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవు

First Published | Mar 16, 2024, 2:04 PM IST

డయాబెటిక్ పేషెంట్లు చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. ముఖ్యంగా రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటే.. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అవేంటంటే? 

పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. ముస్లింలందరూ ఈ మాసంలో ఉపవాసం ఖచ్చితంగా ఉంటారు. అయితే డయాబెటిస్ ఉన్నవారికి ఈ ఉపవాసం కొంచెం కష్టమే. ఎందుకంటే ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా బ్లడ్ షుగర్ పెరుగుతుంది. అయితే మీరు కొన్ని ఉపవాస చిట్కాలను పాటిస్తే ఉపవాసం సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. డయాబెటిక్ పేషెంట్లు ఉపవాసం సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

diabetes

1. డయాబెటిక్ ఉన్నవాళ్లు ఇఫ్తార్, సెహ్రీ సమయంలో తీయని రసాలు లేదా ఎనర్జీ డ్రింక్స్ ను తాగడం మానుకోవాలి. ఎందుకంటే ఇవి తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. అలాగే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ కు కూడా దూరంగా ఉండాలి. 

2. సెహ్రీలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల మీరు రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. అలాగే సడెన్ గా షుగర్ స్పైక్ అవదు. 
 

Latest Videos


3. సెహ్రీ సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేయాలి. అలాగే రోజు రక్తంలో షుగర్ లెవెల్స్ పై నిఘా ఉంచాలి. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయి ఎలా ఉంతో మీకు తెలియజేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలకు అనుగుణంగా మీ ఆహారాన్ని సెట్ చేయండి.
 

4. రంజాన్ మాసంలో నిద్రగంటలు కూడా షుగర్ లెవెల్స్ ను ప్రభావితం చేస్తాయి. అందుకే డయాబెటీస్ ఉన్నవారు కంటి నిండా నిద్రపోవాలి. సరైన నిద్ర ఉంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి.

Diabetes

5. సెహ్రీ, ఇఫ్తార్ సమయంలో మీరు హైడ్రేట్ గా ఉండాలి. ఎందుకంటే డీహైడ్రేషన్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అలాగే మీకు ఎన్నో రకాల సమస్యలను కూడా కలిగిస్తుంది.

6. మీరు ఏ రకమైన డయాబెటిస్ మందులు తీసుకుంటున్నా.. వాటిని స్కిప్ చేయకూడదు. షాయరీ, ఇఫ్తార్ సమయాల్లో మందులను ఖచ్చితంగా వాడండి. 
 


7. ఇఫ్తార్ సమయంలో అతిగా తినడం మానుకోండి. లేకపోతే ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను కూడా బాగాపెంచుతుంది. ఇఫ్తార్ లో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, సంక్లిష్ట పిండి పదార్థాలు మొదలైనవి ఉంటాయి. మరీ ముఖ్యంగా వ్యాయామం చేయడం అస్సలు మర్చిపోకండి. ప్రతిరోజూ వాకింగ్, యోగా చేయండి.

click me!