Monsoon: వర్షాకాలంలో దుస్తులు తొందరగా ఎండాలంటే ఏంచేయాలి?

Published : May 31, 2025, 03:47 PM IST

వర్షాకాలంలో దుస్తులు ఆరబెట్టడం అతి పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. కానీ, సింపుల్ ట్రిక్స్ వాడితే, సులభంగా ఆరబెట్టొచ్చు. మరి, ఆ ట్రిక్స్ ఏంటో తెలుసుకుందామా…

PREV
16
సింపుల్ ట్రిక్స్

వర్షాకాలంలో దుస్తులు తొందరగా ఆరబెట్టాలి అనుకుంటే, తడి వస్త్రాన్ని మందమైన, పొడి టవల్ లో చుట్టి రోల్ చేయాలి. తర్వాత గట్టిగా నొక్కాలి. ఇలా చేయడం వల్ల  దుస్తుల్లోని అదనపు నీరు టవల్ పీల్చుకుంటుంది. తర్వాత ఆరుబయట ఆరేస్తే, తొందరగా డ్రై అవుతాయి.

26
గాలి వచ్చే గదిలో ఆరబెట్టండి

వర్షాకాలంలో దుస్తులను బయట వేయలేం. ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు. కాబట్టి, ఆరు బయట  వేయకుండా మీరు వాటిని ఇంట్లో గాలి వచ్చే గదిలో వేయవచ్చు. ఫ్యాన్ గాలి బలంగా వచ్చే చోట తొందరగా ఆరిపోతాయి.

36
హెయిర్ డ్రైయర్ వాడండి

మీరు వెంటనే ఏదైనా డ్రెస్ ధరించాల్సి వచ్చినప్పుడు, అది తడిగా ఉంటే, మీరు హెయిర్ డ్రైయర్‌తో ఆరబెట్టొచ్చు. మరీ దగ్గరగా కాకుండా..కొంచెం దూరంగా పెడితే.. డ్రెస్ తొందరగా ఆరుతుంది. అయితే..  ఒక్క డ్రెస్ అర్జెంట్ గా కావాలి అంటే ఈ పద్దతి వాడొచ్చు.

46
ఐరన్ తో టవల్ ట్రిక్

తడి డ్రెస్ పై పొడి టవల్ ఉంచి దానిపై వేడి ఐరన్ చేయండి. దీని వలన వేడి , టవల్ రెండూ కలిసి తేమను పీల్చుకుంటాయి. డ్రెస్ త్వరగా ఆరిపోతుంది.

56
ఉప్పు, పటిక నీరు వాడండి

అవును, బట్టలు ఉతికిన తర్వాత ఉప్పు , పటిక వేసి పిండండి. దీని వలన దుస్తులు చాలా త్వరగా ఆరే అవకాశం ఉంటుంది.

66
రూమ్ హీటర్/బ్లోయర్ వాడండి

మీ గదిలో హీటర్ లేదా బ్లోయర్ ఉంటే, మీరు దాని దగ్గర మీ దుస్తులను వేలాడదీయండి, కానీ చాలా దగ్గరగా వేలాడదీయవద్దు. కొంచెం దూరంలో వేలాడదీసి ఖాళీ ప్రదేశంలో వదిలివేయండి. దీని వలన బట్టలు సులభంగా, త్వరగా ఆరిపోతాయి.

Read more Photos on
click me!

Recommended Stories