గర్బిణులు తీసుకునే ఆహారంపైనే గర్బంలో ఉన్న పిండం ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. మంచి పోషకాహారం తీసుకుంటే పిల్లలు శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఎదుగుతారు. అలాగే వారి బ్రెయిన్ కూడా షార్ప్ గా ఉంటుంది. అయితే గర్బిణులు, గర్బంలో పెరుగుతున్న పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
4 నుంచి 6 వారాల గర్బిణులు చిక్కుళ్లు, బ్రోకలీ, ఉసిరి ఆకులు, తృణ ధాన్యాలు, అవిసె ఆకులు, బచ్చలి కూరల, మాసం, గుడ్లు , చికెన్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇవి పిల్లల శరీర ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. గర్భిణులు సిట్రస్ ఫ్రూట్స్ ను కూడా ఎక్కువగా తింటూ ఉండాలి. వీటివల్ల వారికి ఐరన్ బాగా ఉందుతుంది. దీంతో రక్తహీనత సమస్య వచ్చే అవకాశం ఉండదు.
పిల్లల మెమోరీ పవర్ బాగుండాలంటే జింక్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అంతేకాదు ఈ జింక్ రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. అలాగే బ్రెయిన్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. పిల్లలకు సరిపడా జింక్ అందకపోతే వారి మానసిక ఆరోగ్యం బాగుండదు. మెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. జింక్ లభించాలంటే గుడ్లు, చిక్కుళ్లు, పాలు, పాల ఉత్పత్తులు, డార్క్ చాక్లెట్స్ ను ఎక్కువగా తీసుకోవాలి.
పిండానికి మంచి పోషకాలు ఎంతో అవసరం. అవి అందకపోతే అల్జీమర్స్, స్కిజోఫ్రీనియా, మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలా కాకూడదంటే.. పిండం ఆరోగ్యంగా పెరగాలంటే మాంసం, పాల ఉత్పత్తులను, పప్పు దినుసులను, కూరగాయలను, గుడ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
సోయా బీన్స్, ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే పుట్టబోయే పిల్లలు హెల్తీగా ఉంటారు. ఒకవేల పిల్లలో ఈ లోపం ఏర్పడితే డిస్లేక్సియా, ఆటిజమ్, డిస్ ప్రాక్సియా వంటి లోపాలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ లోపాలు రాకూడదంటే చికెన్ తో పాటుగా, గుడ్లు, మిల్క్ ప్రొడక్ట్స్ ను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
పిల్లల బ్రెయిన్ షార్ప్ గా తయారవ్వాలంటే విటమిన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ను తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పిల్లలకు విటమిన్ బి1 లోపిస్తే నాడీ వ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. ఈ విటమిన్ లోపించకూడదంట తాజా పండ్లు, ఆకు కూరలను ఎక్కువగా తింటూ ఉండాలి.
పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు రాగి బాగా ఉపయోగపడుతుంది. రాగి వల్ల పిల్లల ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే రక్తం కూడా పెరుగుతుంది. అంతేకాదు ఇది యాంటీ ఆక్సిడెంట్ల పెరుగుదలకు సహాయపడుతుంది. కొకోవా, పుట్టగొడుగులు, లివర్ వంటి ఆహారాల్లో రాగి ఎక్కువ మొత్తంలో ఉంటుంది.