గర్భిణులు ఎటువైపు తిరిగి పడుకుంటే మంచిది..?

First Published | Aug 21, 2022, 2:56 PM IST

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గర్భిణులు ఎప్పుడూ ఎడమ వైపు తిరిగే పడుకోవాలి. దీనివల్ల జీర్ణక్రియ సులభతరం అవడంతో పాటుగా మరెన్నో ప్రయోజనాలున్నాయి. 

గర్భిణీ స్త్రీలు ఎప్పుడూ కూడా ఎడమవైపు తిరిగే పడుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇలా పడుకోవడం వల్ల రక్తప్రవాహం పెరుగుతుంది. అలాగే పిండానికి, గర్భాశయానికి రక్తప్రవాహం కూడా పెరుగుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే గర్బిణులు నిటారుగా లేదా వీపుపై పడుకోకూడదు. ఇలా పడుకుంటే బిడ్డ ప్రమాదంలో పడతాడు. 

గర్భిణులు ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల వారికి జీర్ణ ప్రక్రియ సులభతరం అవుతుంది. అలాగే మూత్రపిండాలకు, గర్భాశయానికి రక్తప్రవాహాన్ని సులభతరం చేయడానికి సహాయపడుతుంది. వెన్ను నొప్పి నుంచి ఉపశమనాన్ని కూడా కలిగిస్తుంది. ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల  ఎసిడిటీ, గుండెల్లో మంట తగ్గుతాయి. గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది. 


గర్భిణులు కుడివైపు తిరిగి పడుకుంటే పిండానికి రక్తప్రసరణ తగ్గుతుంది. అంతేకాదు ఇది ప్లాసెంటాకు ప్రతికూలంగా ఉంటుంది. ఇకపోతే గర్భిణీ స్త్రీలు పడుకునే ముందు నీటిని అస్సలు తాగకూడదు. ఒకవేళ తాగాలనుకుంటే పడుకునే మూడు గంటల మందే తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

pregnancy

గర్భం  దాల్చిన మొదటి దశలో వీరు హాయిగా పడుకోవచ్చు. రెండో  దశలోనే వీరు ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. ఇక చివరి దశలో వైపుపై పడుకునే అలవాటును పూర్తిగా మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలు ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల హాయిగా నిద్రపుతుంది. అలాగే నిద్రపోయేటప్పుడు వీళ్లు వదులుగా ఉండే బట్టలను వేసుకోవడం మంచిది.

గర్భిణులు స్మూత్ గా ఉండే బెడ్ పై పడకోకపోవడమే మంచిది. వీరికి బలంగా ఉండే మంచమే బెటర్. ఇది వారి శరీరానికి అన్ని విధాలా మద్దతునిస్తుంది. కాళ్ల మధ్యలో దిండు పెట్టుకుని పడుకోవడం వల్ల సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ ఒకే పొజీషన్ లో ఎక్కువ సేపు పడుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. 

Latest Videos

click me!