జుట్టుకు, చర్మానికి మంచిది
ఉసిరి చర్మానికి, జుట్టుకు కూడా మేలు చేస్తుంది. అందుకే దీనిని బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా ఉపయోగిస్తారు. ఇవి అందాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. క్రమం తప్పకుండా ఉసిరి వాటర్ ను తాగడం వల్ల ముడతలు, మొటిమలు తగ్గిపోతాయి. ఈ నీరు జుట్టును బలంగా, నల్లగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.