Holi 2022: హోలీ రోజు జర జాగ్రత్త.. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా.. మీ పని అంతే ఇక..

Published : Mar 12, 2022, 01:09 PM IST

Holi 2022: హోలీ రోజు జల్లుకునే కలర్స్ వల్ల కొందరికి ముఖంపై మొటిమలు రావడం, మచ్చలు, జుట్టు రాలడం, కంటి సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యలు రాకుండదంటే ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాల్సిందే..  

PREV
111
Holi 2022: హోలీ రోజు జర జాగ్రత్త.. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా.. మీ పని అంతే ఇక..

Holi 2022: ఇన్నాళ్లుగా వేచిన హోలీ పండుగ అతికొద్ది రోజుల్లోనే రానుంది. ఈ పండుగ రోజున చిన్నా.. పెద్దా తేడాలేకుండా సంతోషంగా జరుకుంటారు. రకరకాల కలర్లు, నీల్లతో ఈ పండుగను ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే పండుగ వచ్చేసింది కదా అని వైరస్ ఉందన్న సంగతి మర్చిపోతే మాత్రం మీరు ప్రమాదంలో పడినట్టే మరి. 
 

211

కొవిడ్ వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉన్నందున ఈ హోలీకి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొంతమందికి ఈ రంగుల వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు రావడం, హెయిర్ ఫాల్ వంటి పలు సమస్యలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో హోలీ సెలబ్రేషన్స్ లో కొన్నిజాగ్రత్తలను తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం పదండి.. 
 

311

రంగులు జల్లుకుంటున్నప్పుడు ఆ రంగు కళ్లలోకి వెళ్లకుండా చూసుకోవాలి. అంటే ఆ రోజూ ఏదో ఒక కళ్లజోడును పెట్టుకోని ఆడండి. లేదంటే రంగు కంటిలో పడి కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. 

411

హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడేవారు.. హోలీ ఆడుతున్నప్పుడు జుట్టు కవర్ అయ్యేలా తలకు ఏదైనా టోపీ కానీ గుడ్డ కాని చుట్టాలి. లేదంటే మీ జుట్టు మరింత ఎక్కువగా ఊడిపోయే ప్రమాదం ఉంది. 
 

511

చర్మ సంబంధ (Dermatological treatment) ట్రీట్మెంట్ తీసుకున్న వారు హోలీ ఆడకపోవడమే ఉత్తమం. ఎందుకంటే వీరు హోలీ ఆడటం వల్ల చర్మంపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంది. అంతేకాదు వీటి వల్ల దీర్ఘకాలిక రోగాలను ఎదుర్కోవాల్సి పరిస్థితి కూడా ఏర్పడే ప్రమాదం ఉంది. 

611

Artificial కలర్స్ జోలికి వెళ్లకుండా చేసుకోండి. ఎందుకంటే వీటిని జల్లుకోవడం వల్ల అది స్కిన్ కు అత్తుక్కుపోతుంది. దాని వల్ల చిరాకు, మంట, దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. 

711

ఈ పండుగ వేళ కొత్త దుస్తులు వేసుకోకపోవడమే ఉత్తమం. ఎందుకంటే కొత్త దుస్తులపై రంగులు పడితే అవి.. ఆ మరకలు పోవు. దాంతో మీరు మల్లీ వాటిని అస్సలు వేసుకోలేరు. కాబట్టి పాత బట్టలు వేసుకుని హోలీని ఎంజాయ్ చేయండి.
 

811

మీ ఒంటిపై పడిన రంగులు పూర్తిగా ఎండిపోక ముందే వాటిని కడిగేయండి. ఎందుకంటే అవి పూర్తిగా ఎండిపోతే.. ఒంటిపై నుంచి పూర్తిగా తొలగిపోవు.

911

హోలీ ఆడేకంటే ముందే మీ స్కిన్ కు కొబ్బరి నూనెను రాయండి. ఆ తర్వాత హోలీ వేడుకల్లో పాల్గొనండి. ఇలా చేయడం వల్ల ఒంటికి అంటిన రంగులు ఈజీగా తొలగిపోతాయి. 

1011

ఇక కరోనాను యాదిల ఉంచుకుని హోలీ సెలబ్రేషన్స్ చేసుకోవాలి. గుంపులు గుంపులుగా రంగులను జల్లుకోవద్దు.  ముఖ్యంగా మాస్కులను పెట్టుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ.. హోలీని సెలబ్రేట్ చేసుకోండి.

1111

ముఖంపై మచ్చటు, మొటిమలు, అలర్జీలు, దద్దుర్లు సమస్యలు తరచుగా వచ్చే వారు హోలీని ఆడకపోవడమే బెటర్ అంటున్నారు నిపుణులు. వీరు హోలీ ఆడితే ఈ సమస్యలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.   

Read more Photos on
click me!

Recommended Stories