Published : Mar 12, 2022, 12:24 PM ISTUpdated : Mar 12, 2022, 12:29 PM IST
summer drinks: వేసవి కాలం ప్రారంభమయ్యిందో లేదో.. అప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. ఇక మధ్యాహ్నం పూటైతే జనాలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎండల రాకతో మన దాహం కూడా పెరుగుతుంది. అయితే వేసవితాపాన్ని తీర్చడానికి పెరుగు, నిమ్మకాయ, వివిధ పండ్లతో తయారుచేయబడ్డ పానీయాలు మీకు ఎంతో సహాయపడతాయి.
ఎండల రాకతో మాటిమాటికీ దాహం అవుతూ ఉంటుంది. ఈ దాహాన్ని తీర్చుకోవడానికి మనం ఎక్కువగా ఫ్రిజ్ వాటర్ లేదా కూల్ డ్రింక్స్ ను తాగుతూ ఉంటాం. అయినా దాహం మాత్రం తీరదు. అయితే వేసవిలో దూపను తీర్చడానికి కొన్ని రకాల పానియాలు ఎంతో సహాయపడతాయి. అంతేకాదు ఈ పానియాలు మన దేశంలో సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్నాయి కూడా.. మరి అవేంటో తెలుసుకుందాం పదండి..
28
ప్రంపంచంలోనే మొట్టమొదటి శీతల పానియంగా షర్బత్ పేరుపొందింది. ఈ షర్బత్ రకరకాల పువ్వులు, పండ్లతో మిక్స్ చేయడబడిన చక్కెర మిశ్రమం. ఇది మొగల్ పాలన నుంచి కార్యరూపం దాల్చిందని చరిత్ర చెబుతోంది. అలాగే పురాతన గ్రీకు తత్వవేత్త , గణిత శాస్త్రజ్ఞుడు పైథాగరస్‌కి షర్బత్‌ను కనుగొన్నట్లు కొన్ని గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ షర్బత్ కు మూలం ఏదైనా షర్బత్, స్క్వాష్‌లు లేదా స్థానికంగా తయారుచేస్తున్న పానీయాలు శతాబ్దాలుగా మన దాహాన్ని తీర్చుతూనే ఉన్నాయి.
38
Babri Beol
బాబ్రీ బెయోల్.. జమ్మూ అండ్ కశ్మీర్‌లో ప్రసిద్ధి చెందిన బాబ్రీ బియోల్ ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతంలో ప్రత్యేక స్థానం పొందింది. ఈ పానియాన్ని తులసి గింజలు లేదా సబ్జా గింజలతో తయారు చేస్తారు. మొఘల్ చక్రవర్తి బాబర్ ఈ విత్తనాలను ఈ ప్రాంత ప్రజలకు పరిచయం చేశాడని కొందరు చెబుతున్నారు. బాబ్రీ బియోల్ వేసవి దాహాన్ని తీర్చడానికి తయారు చేయబడింది. ఇది ఎంతో రుచిగా కూడా ఉంటుంది. బాబ్రీ బియోల్ ను పాలు, నీళ్లు, తులసి గింజలు , కొబ్బరి వంటి పదార్థాలతో తయారు చేస్తారు. స్థానిక భాషలో దీనిని కాన్ షెర్బత్ అని కూడా పిలుస్తారు. కాన్ అంటే విలువైన ఆభరణాలు అని అర్థం. వాటిని నీటిలో నానబెట్టినప్పుడు అపారదర్శక ముత్యాలుగా ఉబ్బిన విత్తనాలకు సూచనగా దీన్ని అలా పిలుస్తారు.
48
Sol Kadi
సోల్ కాడి.. ఇది వెచ్చని లేదా గది ఉష్ణోగ్రత వద్ద వినియోగించబడే ప్రత్యేకమైన పానియం. ఇది అద్భుతమైన కూలర్‌గా కూడా పనిచేస్తుంది. కోకుమ్ లేదా అమ్సుల్ యొక్క కొంకణ్ తీరం ఒడ్డున ఉద్భవించింది. ఈ బ్లష్ కలర్ డ్రింక్ కొబ్బరి పాలు, కోకుమ్ సిరప్‌తో మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వంటి సుగంధ ద్రవ్యాలతో దీనిని తయారు చేస్తారు. ఇది స్పైసీ లేదా తియ్యగా ఉంటుంది. ఈ రెండు రుచులను మహారాష్ట్ర ప్రజలు ఇష్టంగా తాగుతుంటారు. ఇదిఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కూడా.
58
Gondhoraj Ghol
గోంధోరాజ్ ఘోల్.. మనలో మజ్జిగను ఇష్టంగా తాగే వారు ఎంతో మంది ఉన్నారు. వేసవి వచ్చిందంటే చాలు పక్కాగా మజ్జిక ప్రతి ఇంట్లో ఉంటుంది. అయితే పశ్చిమ బెంగాల్‌లో మజ్జిగను డిఫరెంట్ స్టైల్లో చేస్తారు. గోంధోరాజ్ ఘోల్ అని పిలువబడే ఈ పానీయంలో పెరుగు, నల్ల ఉప్పు, పంచదార, ఐస్ వాటర్, ముదురు ఆకుపచ్చ రంగు నిమ్మకాయ నుండి తీసిన గోంధోరాజ్ రసంతో తయారు చేయబడుతుంది. వేసవికాలంలో ఈ పానియాన్ని ఎక్కువగా తాగుతుంటారు. కానీ ఈ గోంధోరాజ్ ఘెల్ ఏడాదిపాటు అక్కడ తాగుతూ ఉంటారు.
68
Chuak
చుయాక్.. చుయాక్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పానియంలో ఎన్నో ఔషద గుణాలున్నాయి. దీనిని ఎక్కువగా ఈశాన్య భారతదేశంలోని త్రిపుర ప్రాంతం స్థానిక ప్రజలు తయారుచేస్తారు. అన్నం, బీరును పులియబెట్టి ఈ పానియాన్ని తయారుచేస్తారు. ఈ పానియాన్ని ఎక్కువగా పండుగలకు, వివాహాలు వంటి ప్రత్యేక సందర్భాల్లోనే వినియోగిస్తారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పానియాన్ని ఎవరంటే వాళ్లు తయారు చేయరు. అనుభవజ్ఞులైన పెద్దలు మాత్రమే దీనిని తయారు చేస్తారు. ప్రేమ, ప్రశంసలకు చిహ్నంగా కూడా ఈ పానియాన్ని పంచుతారు.
78
Tikhur Sherbat
తిఖుర్ షెర్బత్.. ఛత్తీస్‌గఢ్‌లోని తూర్పు రాష్ట్రానికి చెందిన మరొక ప్రత్యేకమైన పానియం ఇది. ఈ పానియాన్ని ‘పాలో’ అని కూడా పిలుస్తారు. ఇది కర్కుమా అంగుస్టిఫోలియా అని పిలువబడే దేశీయ మూలిక యొక్క ప్రాసెస్ చేయబడిన రైజోమ్. దీనిని ఈస్ట్ ఇండియన్ ఆరోరూట్ అని కూడా పిలుస్తారు. ఈ పానియాన్ని ఎంతో శ్రమించి రోజుల తరబడి తయారుచేస్తారు. ఇది స్థానిక రైజోమ్‌ను తీసుకుని దానిని శుభ్రం చేసి రాత్రిపూట నానబెట్టిన పేస్ట్ లా తయారుచేస్తారు. ఆ తర్వాత వాటి అవశేషాలను వేరు చేయడానికి డీకాంట్ చేసి, ఆపై కరిగే స్టార్చ్ యొక్క సహజమైన గ్లోబుల్స్‌ను తయారు చేయడానికి ఎండబెడతారు. ఆ తర్వాత కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉండే ఈ గ్లోబుల్స్‌తో దీన్ని తయారుచేస్తారు. తియ్యగా ఉండే ఈ పానియం ఎములకల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ పానియం శరీరాన్ని చల్లగా ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది.
88
Nongu Sherbat
నంగు షర్బత్.. తాటి చెట్టు ఐస్ యాపిల్స్ నుంచి దీన్ని తయారు చేస్తారు. ఇది దేశంలోని అనేక ప్రాంతాలలో ప్రసిద్ధి చెందింది. వేసవి తాపాన్ని తీర్చే పానియాల్లో ఇది ప్రసిద్ది చెందింది. అయితే దీనిని మహారాష్ట్రలో టార్గోలా, పశ్చిమ బెంగాల్‌లో తాల్ ,తమిళనాడులో నోంగు వంటి వివిధ పేర్లతో పిలుస్తారు. చక్కెర, నీళ్లు వంటి సాధారణ పదార్థాలతోనే దీనిని తయారు చేస్తారు. కానీ చాలా మంది దీనిలో మామిడి పండ్లు, గులాబీ, పాలను కలిపి తయారుచేస్తారు.