
లేత పచ్చిబఠానీలను కూరలలోనే కాక సాయంత్రం వేళల్లో స్నాక్స్ గా తీసుకున్నా మంచి ప్రయోజనం ఉంటుంది. పచ్చిబఠానీలు జీరో కొలెస్ట్రాల్ ను కలిగి ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలు బోలెడు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పచ్చిబఠానీలను పోషకాల గని (Mine of nutrients) అని పిలుస్తారు. నూరు గ్రాముల పచ్చిబఠానీలలో మూడింతల నీరే ఉంటుంది. అలాగే ఇందులో మాంసకృత్తులు, పీచు 5.5 గ్రాములు ఉండగా 84 కేలరీల శక్తి లభిస్తుంది. వీటిలో ప్రోటీన్లు, సూక్ష్మ పోషకాలు, విటమిన్ల తోపాటు కాల్షియం, ఇనుము, కాపర్, జింక్, మెగ్నిషియం లాంటి ఖనిజాలు (Minerals) సమృద్ధిగా ఉంటాయి.
జీర్ణ, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి: పచ్చిబఠానీలలో పీచుపదార్ధము అధిక మోతాదులో ఉంటుంది. కనుక వీటిని తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి తిన్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. జీర్ణప్రక్రియ (Digestion) సక్రమంగా జరుగుతుంది. అలాగే మలబద్దకం (Constipation) సమస్యలు కూడా తగ్గడంతోపాటు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
బరువును తగ్గిస్తుంది: శరీర బరువును తగ్గించడానికి (Lose weight) పచ్చిబఠాణీలు చక్కగా సహాయపడుతాయి. బరువు తగ్గాలనుకునే వారు ఒక కప్పు ఉడికించిన బఠానీలను స్నాక్స్ లా తీసుకుంటే కడుపు నిండిన భావన (Stomach full feeling) కలిగి ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలనిపించదు. అలాగే చాలా సేపటి వరకూ ఆకలి వేయదు. దీంతో బరువు తగ్గుతారు.
చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది: పచ్చిబఠానీలను తీసుకుంటే శరీర ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం (Skin beauty) కూడా మెరుగుపడుతుంది. ఈ గింజలను తీసుకుంటే చర్మం పై మొటిమలు, మచ్చలు, ముడతలు రావు. అలాగే వృద్యాప్య ఛాయలు దరిచేరవు. దీంతో చర్మ సౌందర్యం మెరుగుపడి యవ్వనంగా (Young) కనిపిస్తారు.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది: పచ్చిబఠానీలలో విటమిన్ సి (Vitamin C) పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే రోగనిరోధక శక్తి (Immunity) పెరిగి అనేక వ్యాధులతో పోరాడే సామర్థ్యం పెరుగుతుంది. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇవి శరీరానికి మంచి ఎనర్జీ బూస్టర్ గా సహాయపడుతాయి.
ఎముకలకు ఆరోగ్యాన్నీ అందిస్తాయి: పచ్చిబఠానీలలో విటమిన్ కె, క్యాల్షియం (Calcium) సమృద్ధిగా ఉంటుంది. ఇవి ఎముకలకు ఆరోగ్యాన్నిచ్చి ఆస్టియోపోరోసిస్ (Osteoporosis) రాకుండా అడ్డుకుంటుంది. ముఖ్యంగా మహిళలు తమ రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకుంటే ఈ వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది: పచ్చిబఠానీలలో విటమిన్ ఎ, బి సి కె మధుమేహంతో వచ్చే రిస్క్ లను తగ్గిస్తాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను (Sugar levels) అదుపులో ఉంచి మధుమేహ (Diabetes) నివారణకు సహాయపడతాయి. కనుక మధుమేహగ్రస్తులు వీటిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
గుండె ఆరోగ్యానికి మంచిది: పచ్చిబఠానీలలో ఉండే పోషకాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (Bad Cholesterol) స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యం (Heart health) మెరుగుపడుతుంది. రక్తపోటు, గుండెపోటు వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.