మారుతున్న జీవనశైలి మన ఆహారపు అలవాట్లలోనూ మార్పులు తీసుకువస్తుంది. ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయ ఆహారలకోసం ప్రపంచవ్యాప్తంగా అన్వేషణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చిందే పొటాటో మిల్క్.. అంటే బంగాళదుంప పాలు.
బంగాళదుంప పాలలో గ్లూటెన్, జంతు ఉత్పత్తులనుంచి వచ్చే చెడు ప్రభావాలు ఉండవు. ఇది ఇప్పుడు యుఎస్, యూరోపియన్ దేశాలలో ఎక్కువగా వాడుతున్నారు. పాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే పాల ఉత్పత్తి ఇది.
బంగాళాదుంప పాల ప్రయోజనాలు : నిపుణుల అభిప్రాయం ప్రకారం, బంగాళాదుంప పాలు విటమిన్ డి, బి 12 ఎక్కుగా లభిస్తుంది. విటమిన్లు ఎ, సి, డి, ఇ, కె వంటి విటమిన్లు, ఖనిజాలు వంటి ఇతర ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటుంది.
బంగాళాదుంప పాలలోని కాల్షియం, ఐరన్ కంటెంట్ ఆవు పాలలో ఉండేవాటికి సమానంగా ఉంటాయి. డైరీ-ఫ్రీ, గ్లూటెన్-ఫ్రీ,, కేసైన్-ఫ్రీ, ఫాట్-ఫ్రీ, కొలెస్ట్రాల్-ఫ్రీ, సోయా-ఫ్రీ.. ఇది ఈ పదార్థాలతో అలెర్జీలు ఉన్నవారికి బాగా పనిచేస్తుంది.
ఇది నేచర్ ఫ్రెండ్లీ.. ఎలాగంటే... ది గార్డియన్ ప్రకారం, బాదం పాల కంటే తక్కువ నీరు పడుతుంది. ఓట్స్ పండించడానికి కావాల్సిన భూమిలో సగం ఉపయోగపడుతుంది. డెయిరీ ఫార్మింగ్ లో ఉత్పత్తయ్యే కార్బన్ డయాక్సైడ్ కంటే తక్కువగా ఉత్పత్తి చేస్తుంది.
మరి ఇంట్లో బంగాళాదుంప పాలు ఎలా తయారు చేయాలి? అంటే.. గో డైరీ ఫ్రీ వెబ్‌సైట్ ప్రకారం, మీరు కేవలం 5 పదార్థాలతో ఇంట్లో బంగాళాదుంప పాలను సులభంగా తయారు చేసుకోవచ్చు. 1 బంగాళాదుంప, 3 కప్పుల నీరు చేర్చి.. చిటికెడు ఉప్పు వేసి ఉడకబెట్టాలి.
ఇప్పుడు, ఒక బ్లెండర్లో నీరు, బంగాళాదుంప, 1 స్పూన్ వెనిల్లా ఎక్స్ ట్రాక్ట్, 14 కప్పు బాదంలు, 2 టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. దీన్ని మెత్తగా అయ్యేవరకు గ్రైండ్ చేయండి. తరువాత దీన్ని మస్లిన్ వస్త్రం ద్వారా వడకట్టాలి. అప్పుడు తాజా తాజా బంగాళాదుంప పాలు సిద్ధమైనట్టు.
ఈ పాలను ఎలా ఉపయోగించాలి? అంటే... ఈ బంగాళదుంప పాలు ప్యాకేజ్డ్ గా కూడా దొరుకుతుంది. అది పాలపొడి రూపంలో దొరుకుతుంది. దీన్ని నీళ్లకు కలిపి పాలు తయారు చేసుకోవడమే.. పాలు ఎలా తయారైనా వాటిని ఓట్స్ లేదా కార్న్ ఫ్లేక్స్ లాంటి వాటిలో వేసుకుని తినొచ్చు, మీ సెరిల్ బౌల్ కు కలిపి తీసుకోవచ్చు. ఎనర్జీ డ్రింక్ లాగా కూడా తాగొచ్చు.