అనుష్కా శర్మ స్మైల్ సీక్రేట్.. ఆయిల్ పుల్లింగ్ తో అన్నీ లాభాలే...

First Published Jul 29, 2021, 4:13 PM IST

అనుష్కశర్మ ఈ సంప్రదాయ ఆరోగ్య విధానాన్ని పాటిస్తుంది. ప్రతీరోజూ క్రమం తప్పకుండా ఆయిల్ పుల్లింగ్ చేస్తుంది. 

ఆయిల్ పుల్లింగ్ అనేది ప్రత్యామ్నాయ ఆరోగ్య వైద్య విధానం. దీని మూలాలు ఆయుర్వేదంలో ఉన్నాయి.
undefined
ఎలా చేస్తారంటే.. ఏదైనా వంటనూనెను నోటినిండా పోసుకుని పుక్కిలిస్తారు. అలా రెండు నుంచి నిమిషాల వరకు పుక్కిలించి.. ఆ తరువాత ఊసేస్తారు. ఆయిల్ పుల్లింగ్ అయిపోయాక నోటిని మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది మౌత్ వాష్ తో నోరు శుభ్రం చేసుకోవడంతో సమానం.
undefined
ఈ చర్యవల్ల పళ్లు శుభ్రతకు, ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాదు శరీరంలోని విషపదార్థాలను తొలగించడంలోనూ ప్రతిభావంతంగా పనిచేస్తుంది.
undefined
పళ్ల మీద మచ్చలు, మరకలు తొలగించి.. ముత్యాళ్లా మెరిసేలా చేస్తుంది. దంతాలను తెల్లగా చేయడానికి ఇందో మంచి ప్రత్యామ్నాయ మార్గం.
undefined
బాలీవుడ్ నటి, క్రికెటర్ కోహ్లీ భార్య అనుష్కశర్మ ఈ సంప్రదాయ ఆరోగ్య విధానాన్ని పాటిస్తుంది. ప్రతీరోజూ క్రమం తప్పకుండా ఆయిల్ పుల్లింగ్ చేస్తుంది.
undefined
అంతేకాదు దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలకు కూడా తన ఇన్ స్టాలో షేర్ చేసుకుంది.
undefined
ఆయుర్వేదం ప్రకారం ఉదయాన్నే పరగడుపున ఆయిల్ పుల్లింగ్ చేస్తే ఎంతో మంచిది.
undefined
ఆయిల్ పుల్లింగ్ చేయడానికి ఎలాంటి నూనెలు మంచివి అంటే... విర్జిన్ కోకోనట్ ఆయిల్, ఆవాల నూనెలు మంచివి.
undefined
ఆయిల్ పుల్లింగ్ చేసేప్పుడు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. ఆయిల్ పుల్లింగ్ చేస్తూ.. ఆయిల్ ను మింగేయకూడదు. అంతేకాదు ఆయిల్ నోట్లో నురగవచ్చేదాకా పుక్కిలించాలి. ఆ తరువాతే ఉమ్మేయాలి.
undefined
ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఆయిల్ ఫుల్లింగ్ చేస్తే ఆరోగ్యకరమైన ముత్యాల్లాంటి పలువరుస మీదవుతుంది.
undefined
click me!