మెడనొప్పి చికాకును తగ్గించే.. సింపుల్ వ్యాయామాలు.. కూర్చున్న చోటే ఈజీగా..

Published : Jul 30, 2021, 11:38 AM IST

కొన్ని రకాల స్ట్రెచ్ లతో మెడనొప్పి నుంచి ఉపశమనం పొందచ్చు. ఇంట్లోనే ఈజీగా కొన్ని రకాల స్ట్రెచ్ లతో మెడనొప్పి నుంచి సాధ్యమైనంత వరకు బయటపడొచ్చు. అలాంటి కొన్ని స్ట్రెచ్ లు మీకోసం..

PREV
19
మెడనొప్పి చికాకును తగ్గించే.. సింపుల్ వ్యాయామాలు.. కూర్చున్న చోటే ఈజీగా..
మెడనొప్పి.. ప్రతీ ఒక్కరిని ఏదో ఒక సమయంలో ఇబ్బంది పెట్టే అంశం. అంతేకాదు గంటల తరబడి సిస్టమ్ ముందు కూర్చుని ఉద్యోగాలు చేయడం.. మీదపడుతున్న వయసు, బరువులు ఎత్తడం ఇవన్నీ కూడా మెడనొప్పికి కారణమవుతాయి.

29
కొన్ని రకాల స్ట్రెచ్ లతో మెడనొప్పి నుంచి ఉపశమనం పొందచ్చు. ఇంట్లోనే ఈజీగా కొన్ని రకాల స్ట్రెచ్ లతో మెడనొప్పి నుంచి సాధ్యమైనంత వరకు బయటపడొచ్చు. అలాంటి కొన్ని స్ట్రెచ్ లు మీకోసం..
కొన్ని రకాల స్ట్రెచ్ లతో మెడనొప్పి నుంచి ఉపశమనం పొందచ్చు. ఇంట్లోనే ఈజీగా కొన్ని రకాల స్ట్రెచ్ లతో మెడనొప్పి నుంచి సాధ్యమైనంత వరకు బయటపడొచ్చు. అలాంటి కొన్ని స్ట్రెచ్ లు మీకోసం..
39
నెక్ బెండ్స్ : తలను అటూఇటూ పక్కలకు కదిలించాలి. మీ చెవి భుజాలకు తాకేలా వంచాలి. దీనివల్ల మెడ సాగినట్టుగా అయ్యి.. చక్కటి వ్యాయామంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో శ్వాసను మరిచిపోవద్దు.

49
షోల్డర్ రోల్స్ : మెడ బరువు, మిగతా ఒత్తిడంతా పడేది భుజాల మీదనే. అందుకే మీ చేతులను భుజాల మీద పెట్టి.. భుజాలను ముందుకు, వెనకకు గుండ్రంగా తిప్పాలి. దీనివల్ల భుజం కండరాలు ఫ్రీ అవుతాయి.

59
చైల్డ్ ఫోజ్ : మోకాళ్ల మీద చేసే ఈ ఆసనం వల్ల మీ మెడ కండరాలు సాగదీయడమే కాకుండా.. వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. మోకాళ్ల మీద వంగి.. చేతులు ముందుకు చాచి.. తలను నేలకు ఆనించి చిన్న పిల్లలాగా పడుకోవడమే ఈ ఆసనం.

69
క్యాట్-కౌ పొజిషన్ : పిల్లి, ఆవులు తమ ఒళ్లును విరుచుకున్నట్టుగా వంగడం. మోకాళ్ల మీద నిలబడి.. చేతులు రెండు భూమికి ఆనించి.. తలను సమాంతరంగా పెట్టి.. శరీరాన్ని విల్లులా వంచాలి. దీనివల్ల నొప్పి ఉపశమనం కలగడమే కాకుండా.. వెన్నుముక ఆరోగ్యంగా తయారవుతుంది.

79
కూర్చుని చేసే స్ట్రెచ్ లు : వర్క్ ఫ్రం హోం చేస్తున్నట్లైతే మీరు కాస్త గ్యాప్ లు తీసుకుంటూ.. ఈజీగా ఉండే సీటెడ్ స్ట్రెచ్ లు చేయాలి.

89
చిన్ టు చెస్ట్ స్ట్రెచ్ : ఈ ఎక్సర్ సైజ్ లో మీ తలని ముందుకు వంచి, గడ్డాన్ని ఛాతీకి వీలైనంత దగ్గరగా తీసుకురావాలి. ఇది మెడ ప్రాంతంలో ఒత్తిడిని తగ్గిస్తుంది.

99
చేతులు మెడ వెనుక పెట్టి మీ భుజాలను చెవుల వరకు రిలాక్స్ డ్ గా స్ట్రెచ్ చేయాలి. ఈ సమయంలో శ్వాసను లోపలికి, బైటికి తీసుకోవడం మరిచిపోవద్దు.

click me!

Recommended Stories