దానిమ్మ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పండు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును నియంత్రించడానికి, గుండె ఆరోగ్యాన్ని రక్షించడానికి సహాయపడతాయి. దానిమ్మలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి, విటమిన్ ఇ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. దానిమ్మలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్ కూడా పుష్కలంగా ఉంటాయి. రోజూ దానిమ్మ పండును తినడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది. అలాగే మధుమేహులకు కూడా ఇది మంచి మేలు చేస్తుంది.