3.జాస్మిన్..
మల్లె సువాసన ఎవరినైనా మంత్ర ముగ్ధులను చేస్తుంది. ఆ వాసనకు మంచిగా నిద్రకూడా పడుతుంది, అయితే.. ఇది ఇండోర్ ప్లాంట్ కాదు కదా అనే సందేహం కలగొచ్చు, అయితే.. ఎండ తగిలితే ఇంటి బాల్కనీలో పెంచుకోవచ్చు. బాల్కనీ నుంచి సువాసన గదిలోకి వచ్చేలా చేసినా పర్లేదు.. లేదంటే... రాత్రిపూట వరకు బెడ్రూమ్ లో ఉంచినా పర్లేదు. మీకు మాత్రం మంచి నిద్రను అందిస్తుంది.