రాత్రిపూట ఫోన్ చూస్తే ఏమౌతుందో తెలుసా?

First Published Mar 29, 2024, 1:14 PM IST

ఉదయం సాయంత్రం అంటూ తేడా లేకుండా స్మార్ట్ ఫోను వాడితే మాత్రం మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోకతప్పదు. ముఖ్యంగా రాత్రిళ్లు ఎక్కువ సేపు ఫోన్ చూసే అలవాటు వల్ల వచ్చే సమస్యల గురించి తెలిస్తే మాత్రం మళ్లీ ఆ పని మాత్రం చేయరు. 
 

పొద్దంత పనుల్లోకి వెళ్లి రాత్రి పడుకోకుండా మొబైల్ ఫోన్లను చూసే అలవాటు చాలా మందికి ఉంటుంది. సోషల్ మీడియాను చూస్తుంటే సమయం కూడా తెలియదు. కానీ ఈ అలవాటు మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అవును రాత్రిపూట ఫోన్లను చూడటం వల్ల మీరు లేనిపోని అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. రోజంతా మొబైల్ ఫోన్లు వాడుతున్నప్పటికీ ప్రతి ఒక్కరూ రాత్రిపూటే రెస్ట్ లేకుండా మొబైల్ ను చూస్తుంటారు. కానీ దీనివల్ల మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందంటే? 
 

మొబైల్ వ్యసనం

నేడు పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లకు బానిసలవుతున్నారు. ఇష్టం లేకపోయినా మన చేతులు మాత్రం మొబైల్ ఫోన్ దగ్గరకే వెళతాయి. అది అటోమెటిక్ గా జరిగిపోతుంది. ఎలాంటి నోటిఫికేషన్ రాకున్నా ఫోన్ ను చెక్ చేస్తుంటారు. కానీ ఈ అలవాటు అస్సలు మంచిది కాదు. అందుకే మొబైల్ వ్యసనం నుంచి బయటపడటానికి ప్రయత్నించాలి. 
 

అధ్యయనం ఏం చెబుతోంది?

అమెరికన్ అకాడమీ ఆఫ్ ఫిజీషియన్స్ అధ్యయనం ప్రకారం.. పడుకునే ముందు ఎక్కువసేపు మొబైల్ ఫోన్లను ఉపయోగించడం వల్ల  శాశ్వత నిద్ర లేమి సమస్య వస్తుంది. నిద్రలేమి వల్ల శారీరక అలసట, కళ్లపై ఒత్తిడి, కంటి అలసటతో పాటుగా ఎన్నో మానసిక, శారీరక సమస్యలు వస్తాయి. 
 

మెలనిన్ ప్రభావం

మెలటోనిన్ అనేది సాధారణంగా మనందరికీ సమయానికి నిద్రపోవడానికి సహాయపడుతుంది. కానీ ఇది తగ్గినప్పుడు మనం సరిగ్గా నిద్రపోలేం. సాధారణంగా రాత్రిపూట ఎంతో ఇంట్రెస్టింగ్ వీడియోలను చూస్తుంటాం. కానీ వీటివల్ల మన నిద్రకు భంగం కలుగుతుంది. ఫలితంగా మెలటోనిన్ ఉత్పత్తి బాగా తగ్గుతుంది.
 

శాశ్వత ప్రభావం

మనం ప్రతిరోజూ కంటినిండా నిద్రపోనప్పుడు , ఎక్కువసేపు మొబైల్ ఫోన్లను ఉపయోగించినప్పుడు మన నిద్ర శాశ్వతంగా ప్రభావితం అవుతుంది. అంటే మీరు ప్రతిరోజూ నిద్రపోలేరు. అందుకే రాత్రిపూట మొబైల్ ఫోన్లను ఎక్కువగా వాడకండి. ఇది మీకు ఎన్నో రోగాలొచ్చేలా చేస్తుంది. 

click me!