Pesara Flour : పెసర పిండితో అదిరి పోయే అందం మీ సొంతం..

First Published | Feb 6, 2022, 11:00 AM IST

Pesara Flour : ముఖంపై నల్లటి మచ్చలు, మొటిమలు, మొటిమల మచ్చలు, జిడ్డును తొలగించడంలో పెసర పిండి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ పిండిని ఫేస్ కు అప్లై చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. మరి ఈ పిండిని ఎలా వాడితే చక్కటి ఫలితాలు వస్తాయో ఇప్పుడుు తెలుసుకుందాం.. 
 

Pesara Flour : నలుగురిలో అందంగా కనిపించాలంటే మాత్రం కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. దీనికోసం మీరు పెద్దగా ఖర్చు పెట్టనవసరం లేదు.  మీకు అందుబాటులో ఉండే వంటింటి వస్తువులతోనే అదిరిపోయే అందాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. అది పెసరపిండితోనే. అవును పెసరపిండితో అద్బుత లాభాలను పొందవచ్చు. మొటిమలు, మొటిమల వల్ల ఏర్పడ్డ మచ్చలను, జిడ్డును తొలగించడమే కాదు ఎన్నో రకాల సమస్యలను పెసర పిండి దూరం చేస్తుంది. ఈ పిండితో ముఖం నిగనిగా మెరిసిపోవడమే కాదు చర్మం మృదువుగా కూడా మారుతుంది. 


చల్ల గాలులకు స్కిన్ బరకగా మారుతుంది. దాంతో ముఖం, చర్మం అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాయి. అటువంటప్పుడు కొంత పెసరపిండిని తీసుకుని అందులో ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. దాన్ని ఒంటికి ముఖానికి నలుగులా అప్లై చేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే చర్మం పై ఉండే  మృతకణాలు తొలగిపోతాయి. తద్వారా మీ స్కిన్ నాజుగ్గా తయారవుతుంది. 

Latest Videos


చర్మంపై ఉండే జిడ్డు, మురికి తొలగిపోయి అందంగా, కాంతి వంతంగా మారాలంటే ఇలా చేయండి. పెసర పిండిని మూడు టీ స్పూన్లు తీసుకుని అందులో ఒక టీ స్పూన్ బియ్యంపిండి, పసుపు కొద్దిగా వేసుకుని అందులో కొంచెం రోజు వాటర్ పోయాలి. ఈ మిశ్రమాన్ని పేస్ట్ మాదిరిగా తయారు చేసుకోవాలి. దాన్ని ముఖానికి రాసుకుని కొద్ది సేపు మసాజ్ చేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే బ్యాక్టీరియా, రంద్రాల్లో ఉండే మురికి అంతా తొలగిపోతుంది. అంతేకాదు దీనివల్ల ముఖం కాంతి వంతంగా తయారవుతుంది. 
 

కొంతమందికి మెడ, మోచేతుల భాగం నల్లగా ఉంటాయి. అంతేకాదు ఆ ప్లేస్ చాలా బరకగా ఉంటుంది. అలాంటివారు పావుకప్పు పెసరపిండిలో ఒక టీ స్పూన్ నిమ్మరసం, రోజ్ వాటర్ ను వేయాలి. దాన్నిపేస్ట్ లా చేసుకుని నల్లగా ఉండే భాగాల్లో అప్లై చేయాలి. తరచుగా ఈ పద్దతిని వాడటం వల్ల చర్మం తెల్లగా మారుతుంది. 
 

ముఖంపై ముడతలు, మొటిమల తాలూకు మచ్చలు తొలగిపోవాలంటే ఇలా చేయండి.. రెండు చెంచాల పెసర పిండిని తీసుకుని అందులో చెంచా తేనె, పావు కప్పు పెరుగు, చిటికెడు పసుపు ఆడ్ చేయాలి. దాన్ని పేస్ట్ మాదిరిగా తయారుచేసుకుని పక్కన పెట్టుకోవాలి.  నీట్ గా ముఖం కడుక్కొని ఆ పేస్ట్ ను అప్లై చేయాలి. దాన్ని ఒక ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత ముఖాన్ని చల్లని లేదా గోరువెచ్చని నీళ్లతో నీట్ గా శుభ్రం చేసుకోవాలి.
 

టూ టేబుల్ స్పూన్స్ పెసరపిండిని తీసుకోవాలి. అందులో పసుపును కొంచిం వేసుకుని దాన్ని బాగా కలుపుకోవాలి.  ఆ తర్వాత ఆ మిశ్రమంలో పచ్చిపాలను కొన్ని కొన్ని గా పోసుకుంటూ పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఆ పేస్ట్ ను ముఖ్యానికి ఫ్యాక్ వేసుకోవాలి. ఒక పదిహేను నిమిషాల పాటు వదిలేసి.. ఆ తర్వాత చల్లని నీళ్లతో శుభ్రపరచుకోవాలి. వారినికి రెండు సార్లు చేస్తే ముఖం ఎప్పుడూ తాజాగా కనిపిస్తుంది. 

click me!