Beauty Tips: చలికాలంలో ముఖం కాంతి విహీనంగా కనిపిస్తుందా.. అయితే ఈ చిట్కాలు పాటించండి!

First Published | Nov 3, 2023, 11:12 AM IST

Beauty Tips: ఇంత అందమైన ముఖం అయినప్పటికీ చలికాలం వచ్చేసరికి ముఖం డ్రై అయిపోయి కాంతి విహీనంగా కనిపిస్తుంది. అయితే ఈ చిట్కాలు పాటిస్తే చలికాలంలో కూడా ముఖాన్ని కాంతివంతంగా మెరిపించవచ్చు అది ఎలాగో చూద్దాం.
 

 చలికాలంలో ఎంతటి అందమైన ముఖం అయినా, చర్మం అయినా కాంతి విహినంగా కనబడుతూ ఉంటుంది. ముఖం మీద ఉండే మొటిమలు మరింత ఇబ్బంది పడతాయి అలాగే చర్మం పొడి బారిపోవటం, చర్మం పేలిపోవటం వంటి ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు.

 అయితే బొప్పాయిని ఉపయోగించి ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు అదెలాగంటే ఒక కప్పు బొప్పాయి గుజ్జుకి పాలలో రాత్రంతా నానబెట్టిన ఓట్స్ కలపాలి. అందులో కొద్దిగా తేనె వేసి మెత్తగా కలపాలి ఈ మిశ్రమాన్ని ముఖంపై ఫేస్ ప్యాక్ లా రాసుకోవాలి.


ఇలా చేస్తే కాంతి కోల్పోయిన చర్మానికి కొత్త నిగారింపు వస్తుంది. అలాగే బొప్పాయి గుజ్జులో అవకాడో పేస్ట్ చేర్చి ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా చేయడం వలన చర్మానికి తగినంత పోషణ లభిస్తుంది. దాంతో చర్మం తేమగా కనిపించి చూడటానికి కాంతివంతంగా కనిపిస్తుంది.

బొప్పాయి గుజ్జులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ముఖంపై అప్లై చేయాలి. కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి ఈ మాస్క్ వల్ల చర్మం రంగు మారడం మాత్రమే కాదు చర్మంలో మంచి కాంతి రూపుదిద్దుకుంటుంది.

 స్కిన్ టోన్ మెరుగుపరిచి స్కిన్ మీద ఉండే మాచ్చలని తగ్గిస్తుంది. అలాగే బొప్పాయి గుజ్జులో రెండు టేబుల్ స్పూన్ల తులసి ఆకుల పొడి, కొద్దిగా తేనె కలిపి రోజూ ముఖానికి పెట్టుకోవాలి. పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో కడుక్కోవడం వలన..

చర్మం యొక్క మృత కణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. బొప్పాయి జ్యూస్ ని టమాటో జ్యూస్ తో మిక్స్ చేసి మొఖానికి అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల గ్లోయింగ్ అండ్ క్లియర్ స్కిన్  పొందవచ్చు.

Latest Videos

click me!