పవిత్రమైన కార్తీక మాసంలో ఈ పరిహారాలు చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి

First Published | Nov 3, 2023, 10:30 AM IST

kartika masam 2023 : అక్టోబర్ 29 నుంచే కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రీమహావిష్ణువుకు పూజలు చేసే ఈ మాసంలో కొన్ని పరిహారాలు చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అవేంటంటే? 
 

హిందూ విశ్వాసాల ప్రకారం.. కార్తీక మాసం విష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసంగా పరిగణిస్తారు. అందుకే భక్తులు ఈ మాసంలో మహావిష్ణువును పూజిస్తారు. ఆయన అనుగ్రహం పొందేందుకు ఎన్నో పరిహారాలను చేస్తుంటారు. అయితే ఈ పవితమ్రైన మాసంలో కొన్ని పనులు చేస్తే శుభ ఫలితాలను పొందుతారని శాస్త్రాల్లో చెప్పబడింది. మరి శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందేందుకు కార్తీక మాసంలో ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

రావి చెట్టుకు పరిహారాలు

రావిచెట్టును పవిత్రమైన చెట్టుగా భావిస్తారు. ఎందుకంటే ఈ చెట్టును దేవతల నివాసంగా భావిస్తారు. అందుకే కార్తీక మాసంలో రావి చెట్టు కింద తప్పకుండా దీపం వెలిగించండి. దీనివల్ల మీకున్న అన్ని రకాల సమస్యల నుంచి బయటపడతారు. 

Latest Videos


కార్తీక స్నానం 

కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర నదిలో స్నానం చేయడం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. కార్తీకమాసంలో నది స్నానం చేయడం వల్ల ఒక వ్యక్తి జనన మరణాల పాపాలు తొలగిపోతాయట. అలాగే వారికి మోక్షం లభిస్తుందని కూడా నమ్ముతారు.

సుఖసంతోషాలు, సౌభాగ్యాలు 

కార్తీక మాసంలో లక్ష్మీసూత్ర పారాయణం కూడా తప్పకుండా చేస్తుంటారు. ఈ పారాయణం మీ జీవితంలోని అన్ని ఆర్థిక సమస్యల నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది. అలాగే మీ సంపద కూడా పెరుగుతుందని. అంతేకాదు భక్తులకు సుఖసంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయని నమ్ముతారు. 
 

తులసి నివారణలు

మిగతా రోజులతో పాటగా కార్తీక మాసంలో కూడా తులసి మొక్కకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. మతవిశ్వాసాల ప్రకారం..కార్తీక మాసంలోనే తులసి వివాహం జరిగిందట. అందుకే ఈ మాసంలో తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజిస్తారు. నిత్యం నీటిని సమర్పిస్తారు. దీనివల్ల తులసి తో పాటుగా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా మీపై ఉంటుంది. 

click me!