Viral: ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ గురించి విని ఉంటారు.. పానిపూరి సబ్‌స్క్రిప్షన్‌ గురించి మీకు తెలుసా?

Published : Feb 17, 2025, 02:43 PM ISTUpdated : Feb 17, 2025, 06:33 PM IST

మీరు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ గురించి విని ఉంటారు. నెల, రెండు నెలలు ఏడాది ఇలా మీకు నచ్చిన ప్లాన్‌ను సబ్‌స్క్రైప్‌ చేసుకుంటారు. అయితే పానిపురి కూడా సబ్‌స్క్రిప్షన్‌ ఉంటే ఎలా ఉంటుంది.? వినడానికి జోక్‌గా ఉంది కదూ! అయితే మహారాష్ట్రకు చెందిన ఓ పానిపూరి అతను ఇలాంటి ఓ వినూత్న ఆఫర్‌ను తీసుకొచ్చాడు..   

PREV
13
Viral: ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ గురించి విని ఉంటారు.. పానిపూరి సబ్‌స్క్రిప్షన్‌ గురించి మీకు తెలుసా?

వ్యాపారంలో పోటీ బాగా పెరుగుతోంది. ఏదైనా వ్యాపారం మొదలు పెడుదామంటే అప్పటికే కాంపిటేషన్‌ ఉంటుంది. లేదూ ఏదైనా కొత్తగా ప్రయత్నిద్దామా అంటే వెంటనే మరో నలుగురు పోటీకి వచ్చేస్తారు. ఇలాంటి ప్రపంచంలో నెగ్గాలంటే కచ్చితంగా వినూత్నంగా ఆలోచించాలి. నలుగురు ఒకే వ్యాపారం చేస్తున్న చోట కస్టమర్‌ మన దగ్గరికే రావాలంటే మనలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాల్సిందే. ఇదిగో ఇదే ఫార్ములాను ఉపయోగించాడు మహారాష్ట్రకు చెందిన ఓ పానిపూరి యజమాని. ఇంతకీ ఆయన చేసిన ఆలోచన ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. 
 

23
Vijay Mewalal Gupta and Panipuri vendors (Photo/ANI)

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన విజయ్‌ అనే పానిపూరీ వ్యాపారి. పానిపూరీలకు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను అందించాడు. ప్రతీసారి డబ్బు చెల్లించే పనిలేకుండా జీవితాంతం ఒకేసారి డబ్బులు చెల్లించే విధానానికి శ్రీకారం చుట్టాడు. జీవితాంతం పానిపూరి తినాలంటే రూ. 99,000 చెల్లించాలని ఆఫర్‌ ఇచ్చాడు. పానిపూరికి అంత ఎవరు ఖర్చు చేస్తారని అనుకుంటున్నారా.? ఇప్పటికే ఓ ఇద్దరు డబ్బులు చెల్లించారు కూడా. 
 

33

ఇక్కడితోనే ఆగిపోలేదు విజయ్‌. మహాకుంభ్‌ పేరుతో రూ. 1 ఆఫర్‌ తీసుకొచ్చాడు. ఈ ఆఫర్‌ ప్రకారం ఎవరైనా వ్యక్తి ఒకేసారి 40 పానిపూరీలను తగిలితే కేవలం రూపాయి చెల్లిస్తే సరిపోతుంది. లేదంటే ఎన్ని తిన్నాడో అంతకు డబ్బులు చెల్లించాలి. అదే విధంగా లాడ్లి బెహెన్‌ యోజన పేరుతో మరో ఆఫర్‌ను కూడా తీసుకొచ్చాడు. మహిళలు రూ. 60 చెల్లించి ఎన్ని పానిపూరిలు తినగలిగితే అన్ని తినే ఆఫర్‌ను అందించాడు.

ఇక నెలవారీగా కూడా ఒక ప్లాన్‌ను ప్రకటించాడు. రూ. 195 చెల్లిస్తే నెల మొత్తంలో అన్‌లిమిటెడ్‌ పానిపూరి తినొచ్చని ప్రకటన చేశాడు. దీంతో ఈ పానిపూరికి పెద్ద ఎత్తున ప్రజలు తరలిస్తున్నారు. ఏది ఏమైనా ఈ పానిపూరి అన్న ఐడియా నిజంగానే భలే ఉంది కదూ! మరెందుకు ఆలస్యం మీరు ఒకవేళ అటువైపు ఉంటే ఓసారి ఈ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను ట్రై చేయండి. 

click me!

Recommended Stories