శివపురాణం ప్రకారం, ఒకసారి బ్రహ్మ, విష్ణువుల మధ్య ఎవరు గొప్పా? అనే వాదన వచ్చింది. ఈ వాదన జరుగుతుండగా, అక్కడ అగ్ని రూపంలో ఒక పెద్ద శివలింగం ప్రత్యక్షమైంది. ‘ఈ శివలింగం చివరను కనుగొన్నవారే గొప్పవారు’ అని అశరీరవాణి వినిపించింది.
చివరను కనుగొనడానికి విష్ణువు జ్యోతిర్లింగం అడుగు భాగానికి, బ్రహ్మ పైభాగానికి వెళ్లారు. చాలా ఏళ్లు ప్రయత్నించినా ఇద్దరూ జ్యోతిర్లింగం చివరను కనుగొనలేకపోయారు. కానీ విష్ణువుతో బ్రహ్మ అబద్ధం చెప్పాడు. ‘నేను ఈ జ్యోతిర్లింగం చివరను కనుగొన్నాను.’ అని.