నీరజ్ చోప్రా ఒలింపిక్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లలో భారతదేశానికి మొదటి పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. టోక్యో 2020లో ఈ స్టార్ జావెలిన్ త్రోయర్ బంగారు పతకాన్ని గెలుచుకుని రికార్డ్ సాధించాడు.
నీరజ్ చోప్రా ఒలింపిక్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లలో భారతదేశానికి మొదటి పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. టోక్యో 2020లో ఈ స్టార్ జావెలిన్ త్రోయర్ బంగారు పతకాన్ని గెలుచుకుని రికార్డ్ సాధించాడు.
రెండవ రౌండ్‌లో 87.58 మీటర్లు విసిరి బంగారుపతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో నీరజ్ తన మొదటి ర్యాంకును నిలుపుకోగలిగాడు. దీంతో 2008 తర్వాత తొలిసారిగా, భారత జాతీయ గీతాన్ని ఒలింపిక్స్‌లో వినిపించారు. దీనికి భారతదేశమంతా పులకించిపోయింది. నీరజ్ చోప్రాకు కృతజ్ఞతలు తెలుపుకుంది.
హర్యానాలోని పానిపట్ సమీపంలోని ఖండ్రా గ్రామానికి చెందిన 23 ఏళ్ల నీరజ్‌కు ఇది మొదటి ఒలింపిక్స్. అథ్లెట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా, ఆహారం, ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
అందుకే అథ్లెట్లు సాధారణంగా వారి ఆహారంలో చాలా శ్రద్ధ చూపుతారు. జంక్ ఫుడ్‌కి దూరంగా ఉంటారు. అయితే ఈ బంగారు కొండ ఏమంటున్నాడో తెలుసా.. దేశీ పానీ పూరి అథ్లెట్లకు బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ అంటూ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
ఈ స్వర్ణ పతక విజేత మాట్లాడుతూ పానీ పూరీ తినడం వల్ల అథ్లెట్ లకు ఎలాంటి హాని లేదని తన అభిప్రాయం అన్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే ఎప్పుడైనా ఓ సారి తింటే దీనికంటే మంచి స్ట్రీట్ ఫుడ్ ఇంకోటి లేదని కితాబునిచ్చాడు.
ఎందుకంటే పానీపూరీలో కడుపును ఫుల్ చేసే నీరు ఎక్కువగా ఉంటుంది. పూరీ చాలా తేలికగా ఉంటుంది. పిండితో తయారు చేస్తారు. పానీ పూరిలో చాలా తక్కువ మసాలా ఉంటుంది. అందుకే దీనివల్ల ఎటువంటి హాని ఉండదు.
మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే నీరజ్ చోప్రా కూడా మంచి వంటవాడు. నీరజ్ చేసే నమ్కీన్ చావల్ తన సర్కిల్ లో బాగా ఫేమస్ అట. పతకం గెలిచారు కదా.. ఇప్పుడు మీరు తినాలనుకున్న చీట్ మీల్ ఏదీ అని అడిగితే.. తను సాధారణంగా తీపిగా తినడానికి ఇష్టపడతానని చెప్పాడు.
panipuri
అయితే స్వీటు తినే కోరికను కంట్రోల్ చేసుకుంటానని.. చాలా తక్కువ మొత్తంలో తింటానని తెలిపాడు. అంతేకాదు.. చపాతీని పొడి చేసి, నెయ్యి, చక్కెర కలిపి చేసే చుర్మా స్వీట్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపాడు. ట్రైనింగ్ టైంలో ఇది తినలేడు కాబట్టి.. ఇప్పుడు తినే సరైన చీట్ మీల్ ఇదే.. ఏమంటారు..