ఫేస్ మాస్క్ వేసుకుంటున్నారా? ఈ తప్పులు చేయకండి...

First Published Aug 9, 2021, 3:37 PM IST

ఫేస్ క్లీనర్, మాయిశ్చరైజర్ కొనేప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. అన్ని రకాలుగా పరీక్షించి.. తమ చర్మ తత్వానికి సరిపోతుందా లేదా అని ఆలోచించి మరీ కొంటారు. కానీ ఫేస్ మాస్కుల విషయానికి వచ్చేసరికి దీన్ని పూర్తిగా మర్చిపోతుంటారు. 

ముఖాన్ని అందంగా మెరిపించడానికి.. కాంతివంతంగా.. సహజసౌందర్యంతో ఉండడానికి రకరకాల ఫేస్ మాస్కులు ట్రై చేస్తుంటారు. అయితే చాలామంది చేసే తప్పు ఏంటంటే.. తమది ఏ రకమైన చర్మ తత్వమో పట్టించుకోకుండా ఫేస్ మాస్కులు వాడడం.
undefined
ఎలాగంటే ఫేస్ క్లీనర్, మాయిశ్చరైజర్ కొనేప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. అన్ని రకాలుగా పరీక్షించి.. తమ చర్మ తత్వానికి సరిపోతుందా లేదా అని ఆలోచించి మరీ కొంటారు. కానీ ఫేస్ మాస్కుల విషయానికి వచ్చేసరికి దీన్ని పూర్తిగా మర్చిపోతుంటారు.
ఫేస్ మాస్క్ అనగానే.. కలిపేసి ముఖానికి అప్లై చేస్తారు. కానీ దీనికి ముందు పాటించాల్సిన ముఖ్యమైన చిట్కా మరిచిపోతారు. అదే ముఖాన్ని క్లెన్సింగ్ చేసుకోవడం. ఫేస్ మాస్క్ వేసుకునే ముందు తప్పనిసరిగా క్వాలిటీ ఫేస్ క్లెన్సర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆ తరువాతే ఫేస్ మాస్క్ అప్లై చేయాలి.
undefined
ఫేస్ మాస్క్ పెట్టుకునే ముందు చేతులు శుభ్రంగా ఉండాలి. బాగానే ఉన్నాయి కదా అని రెగ్యులర్ హ్యాండ్స్ తో అలాగే వాడేయద్దు. ఫేస్ మాస్క్ వేసుకునేముందు శుభ్రంగా కడుక్కుని తరువాతే ఫేస్ మాస్క్ ముట్టుకోవాలి. మీ చేతులు మురికిగా ఉంటే బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములు అన్నీ మీ మొహం మీదికి ట్రాన్స్ ఫర్ అవుతాయి.
undefined
ఇంకొంతమంది ఫేస్ మాస్క్ అనంగానే బాగా పనిచేయాలని .. ఎక్కువ మందంగా వేసుకుంటారు. ఎక్కవ ఫేస్ మాస్క్ ఎక్కువ ఫలితాలను ఏమీ ఇవ్వదు. ఇది గుర్తుంచుకోవాలి. శుబ్రమైన పొడి చర్మం మీద పలుచగా, సమానంగా పరుచుకునేలా ఫేస్ మాస్క్ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
undefined
ఇక షీట్ ఫేస్ మాస్క్ వేసుకునేవాళ్లు రాంగ్ సైజ్ వాడొద్దు. ఒకవేళ ఆ మాస్క్ మీ మొహానికి పెద్దదవుతుంటే అలాగే వాడకండి. కత్తెరతో అవసరం మేరకు కత్తిరించిన తరువాతే దాన్ని మొహానికి అంటించండి.
undefined
మాస్కుల్లో రకరకాలుంటాయి. క్లే మాస్క్ వేసుకుంటే.. పడుకోవద్దు.. అలాగే కొన్ని మాస్కులు రాత్రిమొత్తం వేసుకునేవి ఉంటాయి. ఇంకొన్ని కేవలం ఉదయం వేళ్లలో మాత్రమే వేసుకోవాలి. మీరు వేసుకుంటున్ మాస్క్ ఏ రకమో చూసుకుని మరీ వాడడం మంచిది.
undefined
మాస్క్ ఎంత సేపు వేసుకోవాలని సూచిస్తారో. అంతసేపే వాడడం మంచిది. ఎక్కువ సమయం ఉంచడం వల్ల అదనపు ప్రయోజనాలు ఏమీ ఉండవు. సరికదా కొన్నిసార్లు చర్మం డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మాస్క్ వాడేముందు ఇన్ స్ట్రక్షన్స్ పూర్తిగా చదివి దాని ప్రకారమే ఫాలో కావాలి.
undefined
ఫేస్ మాస్క్ వేసుకోవడం.. తీయడం.. మొహం శుభ్రం చేయడం అయిపోయాక.. మొహానికి మంచి నాణ్యత కలిగిన మాయిశ్చరైజర్ వాడాలి. దీనివల్ల ఫేస్ మాస్క్ వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు మరింతగా లభిస్తాయి.
undefined
ఫేస్ మాస్క్ వేసుకున్నాక.. పదే పదే ముట్టడం.. సర్దుకోవడం, రుద్దడం లాంటివి చేయకూడదు. దీనివల్ల ఫేస్ మాస్క్ వల్ల కలిగే ప్రయోజనాలు కలగకుండా పోతాయి.
undefined
click me!