Recipes: పన్నీర్ చీజ్ సాండ్విచ్.. పిల్లలకి అదిరిపోయే హెల్దీ స్నాక్!

First Published | Oct 7, 2023, 3:03 PM IST

 Recipes: పిల్లల చిరుతిండి కోసం తల్లులకు ఎప్పుడూ యాతనే. ఏం చేసి పెట్టినా కొత్త వెరైటీ కావాలంటారు. అందుకే వాళ్ళకి కొత్తగా, హెల్దిగా  పన్నీర్ చీజ్ సాండ్విచ్ బెస్ట్ ఆప్షన్. మరెందుకాలస్యం రండి చేసేద్దాం.
 

 స్కూల్ నుంచి లేదా కాలేజీల నుంచి అలసిపోయి ఇంటికి వచ్చిన పిల్లలు రుచిగా ఏమైనా తినాలని కోరుకుంటారు. అలాంటి పిల్లలకి రోజూ ఒకే రకం చేసి పెడితే చిరాకు పడతారు అందుకే వాళ్ళకి ఆరోగ్యానికి ఆరోగ్యం.
 

రుచికి రుచి అయిన పన్నీర్ చీజ్ శాండ్విచ్ పెడితే ఒక పట్టు పడతారు. ఇంతకీ ఇది తయారు చేయడానికి కావలసిన ఇంగ్రిడియంట్స్ ఏంటో చూద్దాం.బ్రెడ్ స్లైసులు మీకు ఎన్ని శాండ్విచ్లు కావాలో దాన్ని బట్టి తీసుకోండి.
 


ఉల్లిపాయ ఒక మీడియం సైజు సన్నగా తరిగినది, కారంపొడి ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి ఒక టేబుల్ స్పూన్, టమాటా కెచప్ మూడు స్పూన్ లు .పన్నీర్ ముక్కలు ఒక కప్పు అలాగే చీజ్ మీకు నచ్చినంత. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం.
 

బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. తర్వాత ఉప్పు, మసాలాపొడులు వేసి బాగా కలపండి. అందులోనే ఇంకా చీజ్ కూడా వేయండి. ఆపై పన్నీరు వేసి బాగా కలియబెట్టండి.
 

ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని పైన పన్నీరు మిక్స్ అలాగే చీజ్ వేసి మరొక బ్రెడ్ స్లైస్ తో కవర్ చేయండి. దానిని బంగారు రంగు వచ్చేవరకు రెండు వైపులా కాల్చండి. ఆ తరువాత ట్రయాంగిల్ షేప్ వచ్చేలా మధ్యకి కట్ చేసి సర్వ్ చేయండి.

 అదిరిపోయే ఈ స్నాక్ ఐటమ్ పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అంతేకాదు ఇది ఆరోగ్యానికి కూడా  చాలా మంచిది. ఇదే పన్నీర్ చీజ్ సాండ్విచ్ ని ఇంకో రెండు విధాలుగా కూడా చేసుకోవచ్చు. వాటిని మరోసారి చేసుకుందాం.

Latest Videos

click me!