టూరిస్టుల డ్రీమ్ డెస్టినేషన్....
ఈ విచిత్ర ద్వీపం కేవలం ఒంటరితనానికే కాదు, అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి కూడా నిలయం. ముఖ్యంగా వేసవికాలంలో ఇక్కడకు లక్షలాదిగా వచ్చే 'పఫిన్' అనే పక్షులను చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి టూరిస్టులు క్యూ కడుతుంటారు. ఈ ద్వీపానికి మీరు వెళ్లాలి అంటే.. కొన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. అంటే.. సంవత్సరంలో ఎప్పుడైనా మీరు ఇక్కడికి వెళితే.. మీరు పెద్దగా ఎంజాయ్ చేయలేకపోవచ్చు. కానీ, మే నుండి ఆగస్టు మధ్య కాలంలో వెళితే మాత్రం.. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ముఖ్యంగా పఫిన్ పక్షులను చూడటానికి కరెక్ట్ టైమ్ ఇది. ఈ నెలల్లోనే టూరిస్టులు ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే, ఈ ప్రదేశాలను మీరు చూడాలంటే లోకల్ గైడ్ సహాయం తీసుకోవాలి. ఇక్కడ దాదాపు 6 నుంచి 7 కిలో మీటర్ల దూరం హైకింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే.. ఇక్కడికి వెళ్లడం కూడా అంత ఈజీ కాదు. ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా ఈ ద్వీపానికి రోజుకు కేవలం 100 నుంచి 150 మందిని మాత్రమే అనుమతిస్తారు.
టూరిస్టులను పక్కన పెడితే.. ఇక్కడ కేవలం ఆరుగురు మాత్రమే నివసిస్తూ ఉంటారు. ఆ నివసించే ఆరుగురు కూడా.. అక్కడికి వచ్చే టూరిస్టుల అవసరాలు తీర్చడానికి, గైడ్ గా ఉంటూ టూరిస్టుల హెల్ప్ చేయడానికి ఉండేవారే కావడం విశేషం. వాళ్లు తప్ప.. అక్కడ ఇంకెవరూ ఉండరు. ఇక, ఈ ప్రదేశానికి ఎక్కువ మందిని అనుమతించకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఎక్కువ మందిని అనుమతి ఇస్తే.. ఆ అందమైన ప్రదేశం పాడైపోతుంది. అంతేకాకుండా.. పక్షులకు కూడా అసౌకర్యంగా ఉంటుంది. పక్షులు గూడ్లు పెట్టే సున్నితమైన ప్రాంతాలను రక్షించడానికి టూరిస్టులు కేవలం నిర్దేశిత మార్గాల్లో మాత్రమే నడవాలని ట్రావెల్ నిపుణులు సూచిస్తున్నారు. వారు చెప్పిన రూల్స్ కచ్చితంగా ఫాలో అవ్వాలి.
ఈ ద్వీపానికి సంబంధించిన ఓ వీడియోని ఒక నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది కాస్త వైరల్ గా మారింది. ఈ విభిన్నమైన, సాహసోపేతమైన ద్వీపం గురించి తెలుసుకున్న నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ ఆశ్చర్యపోతున్నారు. "భూమిపై స్వర్గం అంటే ఇదే కాబోలు", "హెలికాప్టర్‌లో మాత్రమే ప్రయాణించడం, క్యూట్ పఫిన్ పక్షులను నేరుగా చూడటం భలే థ్రిల్లింగ్‌గా ఉంది" అంటూ తమ మనసులోని అభిప్రాయాలను పంచుకుంటున్నారు.