ఫ్లైట్ ఎత్తు, అక్కడి పొడి గాలి, క్యాబిన్ ప్రెజర్ మన ఫుడ్ టేస్ట్‌పై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. క్లినికల్ న్యూట్రిషనిస్ట్, యూకే సర్టిఫైడ్ అడ్వాన్స్‌డ్ ఫ్యాట్ లాస్ అండ్ మెటబాలిక్ హెల్త్ కోచ్ నిషిక చెబుతున్న ప్రకారం ఫ్లైట్ 35,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్నప్పుడు ఆహారం ఆస్వాదించే విధానంలో మార్పు వస్తుంది.
ఫ్లైట్‌లో ఉన్నప్పుడు తక్కువ తేమ, క్యాబిన్ ప్రెజర్, విమానం ఇంజిన్ సౌండ్ మన రుచి, వాసన చూసే సామర్థ్యంపై ప్రభావం చూపుతాయి. మనం ఏదైనా రుచి చూస్తున్నామంటే అందులో వాసన పాత్ర కూడా చాలా ఉంటుంది. ఫ్లైట్ క్యాబిన్‌లో తేమ తక్కువగా ఉండటం వల్ల నోరు, ముక్కు లోపలి భాగం పొడిబారుతుంది. దీనివల్ల వాసన, రుచిని పసిగట్టే సామర్థ్యం తగ్గుతుంది. అలాగే విమానం సౌండ్ వల్ల తీపి రుచి తక్కువగా అనిపిస్తుంది. కానీ టొమాటో, మష్రూమ్, చీజ్ లాంటి వాటిలో ఉండే వాటి రుచి మాత్రం బాగా తెలుస్తుంది. అందుకే ఫ్లైట్‌లో టొమాటో జ్యూస్ ఎక్కువగా తాగుతారు.