Government Jobs Portal ఒకే క్లిక్‌తో మొత్తం ప్రభుత్వ ఉద్యోగ సమాచారం! ఎక్కడంటే..
ఒక్కో ఉద్యోగానికి ఒక్కో వెబ్ సైట్, ఒక్కో కొలువు ఒక్కో రకమైన దరఖాస్తు విధానం.. ఇలాంటివి ఉద్యోగార్థులకు చికాకు తెప్పిస్తుంటాయి. ఈ చిక్కులకు చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త విధానం అమల్లోకి తెస్తోంది. ఇందులో ఉద్యోగార్థులు ఒకే చోట అన్ని ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం తెలుసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా సులువుగా, త్వరగా అయిపోతుంది.