oily skin: ఆయిలీ స్కిన్ ను ఇలా వదిలించుకోండి..!

Published : May 15, 2022, 12:45 PM IST

oily skin: మీ చర్మంపై అదనపు నూనెను వదిలించుకోవాలంటే ముఖాన్ని తరచుగా కడుగుతూ, శుభ్రం చేసుకోవాలి. ముఖంపై పేరుకుపోయిన మురికి, నూనె మొటిమలు వంటి సమస్యలకు దారితీస్తుంది.  

PREV
16
oily skin: ఆయిలీ స్కిన్ ను ఇలా వదిలించుకోండి..!

జిడ్డు చర్మం ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా ముఖంపై జిడ్డు ఎక్కువగా పేరుకుపోతే.. మొటిమలు వంటి ఇతర చర్మ సమస్యలు కూడా వస్తాయి. అందుకే జిడ్డు చర్మం ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది.

26

జిడ్డు చర్మం ఏర్పడటానికి ప్రధాన కారణం సెబమ్ మోతాదుకు మించి ఉత్పత్తి కావడం. ముఖ్యంగా వేసవిలోనే చర్మం తరచుగా జిడ్డుగా మారుతుంది. ఆయిల్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఈ క్రింది టిప్స్ పాటిస్తే.. ఆయిలీ ఫేస్ ను వదిలించుకోవచ్చు. 

36

చర్మంపై అదనపు నూనెలను వదిలించుకోవాలంటే మీ ముఖాన్ని తరచుగా కడగడంతో పాటుగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఇలా చేయకపోతే ముఖంపై విపరీతంగా పేరుకుపోయిన మురికి, నూనెల వల్ల మొటిమలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

46

క్లీన్సర్ తో మీ చర్మాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ఆయిలీ స్కిన్ పోతుంది. ఇందుకోసం మీ చర్మానికి సరిపోయే ప్రొడక్ట్స్ ను ఉపయోగించాలి. జిడ్డు చర్మం ఉన్నవారు జెల్లీ లేదా జెల్ ఆధారిత ఉత్పత్తులను ఉపయోగిస్తే బెటర్. 

56

మీ చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికైనా,  మీ శరీరం నుంచి టాక్సిన్స్ ను బయటకు పంపడానికైనా .. మీరు నీళ్లను పుష్కలంగా  త్రాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీటినైనా తాగండి.  అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం.. నీళ్లు మీ శరీరాన్ని ఎన్నో వ్యాధుల నుంచి రక్షించడంతో పాటు మీ చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి కూడా. 

66

క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్ అప్లై చేస్తే కూడా ఆయిలీ ఫేస్ మటుమాయం అవుతుంది. ఇది ఎండవల్ల ముఖంపై ఏర్పడిన మచ్చలను తొలగించడానికి ఉపయోగపడటమే కాదు చర్మం పై ఉండే అదనపు నూనెను తొలగించడానికి కూడా సహాయపడుతుంది.

click me!

Recommended Stories