Weight Loss Drinks: ఈ ఒక్క పానీయం తాగితే చాలు మీ కొవ్వు వెన్నలా కరిగిపోతుంది ..!

Published : May 15, 2022, 10:59 AM IST

Weight Loss Drinks: బరువు తగ్గడానికి ఒక్క వ్యాయామం తప్ప మిగతా అన్ని చర్యలను చేసే వారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారు ఈ మూడు మసాలా దినుసులతో ఈజీగా బరువు తగ్గొచ్చు.   

PREV
16
Weight Loss Drinks: ఈ ఒక్క పానీయం తాగితే చాలు మీ కొవ్వు వెన్నలా కరిగిపోతుంది ..!

Weight Loss Drinks: ప్రస్తుతం చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. కానీ ప్రస్తుత కాలంలో అధిక బరువును నుంచి బయటపడటం అంత సులువైతే కాదు. ఎందుకంటే ప్రస్తుతం చాలా మందికి జిమ్ములకు వెళ్లి కసరత్తులు చేసే సమయం ఉండటం లేదు. 
 

26
weight loss

ఒక్క వ్యాయామం తప్ప మిగతా టిప్స్ ను ఫాలో అవుతుంటారు. అలాటి వారికి వంటగదే చక్కటి మార్గం అని చెప్పాలి. ఎందుకంటే మీ వంటింట్లో ఉండే మూడు మసాలా దినుసులతో పానీయాన్ని రెడీ చేసుకుని తాగితే సులభంగా బరువు తగ్గడమే కాదు.. ఉదర సంబంధ సమస్యలు కూడా తొలగిపోతాయి. 

36
Weight loss

బరువు తగ్గడానికి ప్రత్యేక పానీయం.. జీలకర్ర, సోంపు గింజలు, మెంతుల(కొత్తిమీర గింజలు) సాయంతో కొవ్వును వెన్నను కరిగించినట్టు కరిగించొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందుకోసం ఈ మూడు మసాలా దినుసులను ఒక టీస్పూన్ చొప్పున తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఈ వాటర్ ను ఉదయం తేలికపాటి మంట మీద మరిగించాలి. ఆ తర్వాత దానిని వడగట్టి తాగాలి. ఈ పానీయానికి నిమ్మకాయ, నల్ల ఉప్పు కలిపితే మంచి ప్రయోజనం ఉంటుంది. 

46

సోంపు ప్రయోజనాలు.. సోంపు తినడం వల్ల ఖనిజాలు, విటమిన్లు బాగా శోషించబడతాయి. ఇది వేగంగా బరువు తగ్గడానికి దారితీస్తుంది. ఈ సోంపులో పుష్కలంగా ప్రోటీన్ ఉంటుంది. ఒక టీ స్పూన్ సోంపులో 20 కేలరీలు, 1 గ్రాము ప్రోటీన్,3 గ్రాముల పిండి పదార్థం, 2 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇవి జీవక్రియ రేటును మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా ఇది బరువు తగ్గడానికి ముఖ్యమైన కారకం కూడా.

56
Coriander

ధనియాల ప్రయోజనాలు.. ధనియాలు(కొత్తిమీర గింజల్లో) యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఉండే అదనపు నీటిని బయటకు పంపడానికి ఎంతో సహాయపడుతాయి. ముఖ్యంగా ఈ గింజల వల్ల ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ధనియాలు రక్తంలో షుగర్ లెవెల్స్ ను, కొలెస్ట్రాల్ ను కూడా అదుపులో ఉంచుతుంది. ఈ గింజల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. 

66

జీలకర్ర ప్రయోజనాలు.. జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే కాల్షియం, కాపర్, ఐరన్, మాంగనీస్, జింక్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అలాగే విటమిన్ ఎ, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. జీలకర్రను తినడం వల్ల మెటబాలిజం మెరుగుపడుతుంది. బెల్లీ ఫ్యాట్ కూడా వేగంగా తగ్గుతుంది. 

click me!

Recommended Stories