Health Tips: అల్లం మన ఆరోగ్యానికి మేలు చేసేదే అయినా.. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారతీయ వంటల్లో ఖచ్చితంగా అల్లం ఉంటుంది. అల్లం కేవలం ఒక మసాలా దినుసు మాత్రమే కాదు.. దీన్ని మన తాతల కాలం నుంచి ఎన్నో జబ్బులకు నివారణగా ఉపయోగించారు. ఇప్పటికి కూడా దీనిని ఆయుర్వేద మందుల్లో ఖచ్చితంగా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే దీనిలో ఎన్నో ఔషద గుణాలున్నాయి.
27
అల్లం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ.. దీనివల్ల కూడా కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకు మోతాదుకు మించి అల్లం తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.
37
రక్తస్రావానికి కారణమవుతుంది.. అల్లంలో యాంటీ ప్లేట్ లెట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు లవంగాలు లేదా వెల్లుల్లితో అల్లంను కలిపి తీసుకోవడం వల్ల అధిక రక్తస్రావం అయ్యే ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
47
గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది.. గర్భిణులు అల్లాన్ని తినకూడని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది శరీర వేడిని పెంచుతుంది. ఇది కడుపులో పిండానికి అస్సలు మంచిది కాదు. అంతేకాదు ఇది గర్భస్రావం అయ్యే అవకాశాలను కూడా పెంచుతుంది.
57
ginger
గుండె సమస్యలు వస్తాయి.. అధిక మొత్తంలో అల్లాన్ని తీసుకుంటే మీపై చెడు ప్రభావం పడుతుంది. ముఖ్యంగా మోతాదుకు మించి అల్లం తీసుకోవడం వల్ల గుండె రోగులుు అస్వస్థతకు గురవుతారు. ఎందుకంటే ఇది సక్రమంగా లేని హృదయ స్పందన ప్రమాదాన్ని పెంచుతుంది.
67
డయారియాకు కారణమవుతుంది.. మోతాదుకు మించి అల్లం తీసుకోవడం వల్ల పేగుల, మలం యొక్క కదలికలు వేగవంతం అవుతాయి. దీనివల్ల మీరు డయేరియా బారిన పడొచ్చు. అంతేకాదు ఇది మిమ్మల్ని బలహీనంగా, శక్తి లేకుండా చేస్తుంది.
77
చర్మం, కళ్లకు అలెర్జీ.. అల్లంను ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మంపై దద్దుర్లు, కళ్లు ఎర్రబడటం, Dyspnea, దురద, పెదవుల వాపు, గొంతునొప్పి వంటి సమస్యలు కలుగుతాయి. ఇలాంటి పరిస్థితిలో ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.