Mothers Day 2022: మదర్స్ డే నాడు అమ్మకు ఇచ్చే విలువైన గిఫ్ట్ ఇదే..

Published : May 07, 2022, 12:04 PM ISTUpdated : May 07, 2022, 12:26 PM IST

Mothers Day 2022: అమ్మ మన కోసం ఎన్నో చేస్తుంది. తనంటూ ఒక్కతి ఉందన్న సంగతి మర్చిపోయి.  అమ్మకు మనం ఎన్ని చేసినా తక్కువే. ఆమెనే చూస్తూ పెరిగిన మనం అమ్మను కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యం చేస్తుంటాం. 

PREV
19
Mothers Day 2022: మదర్స్ డే నాడు అమ్మకు ఇచ్చే విలువైన గిఫ్ట్ ఇదే..

Mothers Day 2022: ప్రతి తల్లి తన జీవితాన్ని తన పిల్లలకే అంకితం చేస్తుంది. అందుకే తల్లీబిడ్డల బంధం ఎంతో ప్రత్యేకమైంది. ఎంతటి కష్టమొచ్చినా..తన పిల్లలను మాత్రం ఒంటరిగా వదిలిపెట్టదు. ప్రాణం పోతున్నా.. ఇది అమ్మ గొప్ప తనం. ప్రతి స్త్రీ డెలివరీ సమయంలో చచ్చి బతుకుతుంది. అందుకే డెలివరీ ప్రతి స్త్రీకి మరో జన్మే అవుతుంది. పిల్లలే తన సర్వస్వం. తను బతికేది కూడా పిల్లల కోసమే. 

29

మనకు ఎన్ని బాధలొచ్చినా అమ్మ ఒడిలో పడుకుంటే చాలు అవన్నీ మటుమాయం అవుతాయి. అమ్మే మనల్ని ముందుకు ధైర్యంగా నడిపేది. అమ్మే మనకు ఎల్లవేళలా తోడుండేది. అందుకే అమ్మ ప్రేమ ఉంటే ఎంతటి కష్టాన్నైనా దాటేయొచ్చు అంటారు పెద్దలు. 

39
mothers day

ప్రతి ఒక్కరి లైఫ్ లో అమ్మకు ప్రత్యేక స్థానం, గౌరవం ఉంటుంది. తల్లులను ప్రేమించే పిల్లలకు ప్రతిరోజూ మదర్స్ డేనే. ఎంతైనా అమ్మ రుణం తీర్చుకోవడానికి మనం ఏడేడు జన్మలెత్తినా సరిపోవు. ఏదైమైనా తల్లుల కోసం ఒక ప్రత్యేకమైన రోజును జరుపుకుంటారు. ఈ మే రెండవ ఆదివారం మదర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. మదర్స్ డేను భారతదేశంతో సహా ప్రపంచంలోని ఎన్నో దేశాలు జరుపుకుంటాయి. మరి ఈ రోజున మీ అమ్మకు రకరకాల గిఫ్ట్ లు ఇస్తుంటారు. నిజానికి అమ్మకు మీరు ఇవ్వాల్సిన విలువైన గిఫ్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

49

ఆరోగ్యం గురించి అడగండి.. పిల్లల బాగోగులు చూసుకోవడానికే తల్లి జీవితం ముగిసిపోతుంది. నేనంటూ ఆరోగ్యంగా ఉండాలి.. అని ఏనాడు అనుకోదు. ఏదైన సమస్య వచ్చినా దాన్నిచెప్పడానికి వెనకాడుతుంది. అది తల్లి.. అలాంటి తల్లి గురించి బిడ్డలుగా పట్టించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా వయసు మీదపడుతున్నకొద్దీ మోకాళ్ల నొప్పులు, ఊబకాయం, బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే మదర్స్ డే నాడు అమ్మకు విషెస్ చెప్పడమే కాదు.. ఆమె ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుని హాస్పటల్ కు తీసుకెళ్లండి.. 
 

59

ఇష్టమైన ఫుడ్ చేయండి.. అమ్మకు తెలుసు తన పిల్లలు ఏది ఇష్టంగా తింటారో.. కానీ తన తల్లికి ఏది ఇష్టమో.. ఏది తినాలని కోరుకుంటుందో..  90 శాతం పిల్లలకు తెలియదు. అసలు మా అమ్మ తిన్నదా లేదా అని పట్టించుకోని వారు కూడా ఉన్నారు. మీ గురించి, మీ ఆరోగ్యం గురించి, మీ ఇష్టా ఇష్టాలను తెలుసుకునే మీ అమ్మ గురించి పట్టించుకోకపోవడం సరైంది కాదు. అమ్మకోసం మీరెన్ని చేసినా తక్కువే. కాబట్టి మదర్స్ డే నాడే కాదు సమయం దొరికినప్పుడల్లా మీ అమ్మకు ఇష్టమైన వంటకాలను వండుతూ ఉండండి. 

69

ఒక ఉత్తరం రాయండి.. ఇది డిజిటల్ యుగం. ఏ విషయమైనా సరే ఫేస్ బుక్కో.. లేకపోతే వాట్సాప్ లోనే చెబుతుంటారు. కానీ వీటికంటే మీ మనసులోని భావాలను చెప్పడానికి ఉత్తరం ఎంతో బాగా ఉపయోపగపడుతుంది. మీ అమ్మపై ఉన్న ప్రేమను అందమైన అక్షరాల రూపంలో  ఒక కాగితంపై వ్యక్తపరచండి. మీ భావాలను చెప్పడానికి ఇంతకంటే మంచి మార్గం ఇంకోటి లేదు. ఇది పాత పద్దతి అయినా.. మీ అమ్మ ఎంతగానో సంతోషిస్తుంది. లేఖను చదవానికి.. వాట్సాప్ లో సందేశాన్ని చదవడానికి చాలా తేడా ఉంది. 
 

79

సాయంత్రం పూట అలా అలా బయటకు వెళ్లండి.. ఈ మండుతున్న ఎండలకు మధ్యాహ్నం పూట బయటకు వెళ్లడం కాస్త కాష్టమే. అందుకే సాయంత్రం వేల మీ అమ్మతో కలిసి పార్క్ కు లేదా మాల్ కు నడుచుకుంటూ వెళ్లండి. వారితో షాపింగ్ చేయించండి. అంతేకాదు వారిని  సర్ ప్రైజ్ చేయడానికి మంచి హోటల్ కు కూడా తీసుకెళ్లండి. 

89

పాత జ్ఞాపకాలు:  ఈ గజిబిజీ లైఫ్ లో ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా సమయం గడపని వారు చాలా మందే ఉన్నారు. కానీ ప్రతి తల్లీ తన బిడ్డతో ఎన్నో విషయాలను పంచుకోవాలనుకుంటుంది. ఎన్నో ఊసులను చెప్పాలనుకుంటుంది. జాబ్స్ కారణంగా ఎంతో మంది తల్లిదండ్రులతో కనీసం ఫోన్ మాట్లాడటానికి కూడా సమయం లేకుండా గడుపుతున్నారు. అందుకే మదర్స్ డే నాడన్నా.. మీ అమ్మతో ఎక్కువ సమయాన్ని గడపండి. మీ అమ్మ తన చిన్నతనంలో ఏమేమి చేసిందో లాంటి విషయాలను గుర్తుచేయండి. ముఖ్యంగా ఆమె బాల్యం ఎలా గడిచిందో గుర్తుచేయండి. ప్రతి ఒక్కరికీ బాల్యం ఎన్నో జ్ఞాపకాలను మిగుల్చుతుంది. తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు.. మీరు ఎలా ఉండేవారు లాంటి విషయాలను అడగండి. అంతేకాదు లూడో, చదరంగం లాంటి ఇండోర్ ఆటలను అమ్మతో ఆడండి.. 

99

ఇవి చాలా చిన్నవిగా అనిపించినా.. మీ అమ్మను ఎంతో సంతోషపెడతాయి. మదర్స్ డే అని పెద్ద పెద్ద గిఫ్ట్ లు, కాస్ట్ లీ బహుమతులు కొనాల్సిన అవసరం లేదు. ఇవి చేసినా మీ మదర్ ఎంతో ఆనంద పడుతుంది. తనతో మీరు సమయం గడిపినందుకు.  
 

click me!

Recommended Stories