3.నిమిషాల్లో వేడి వేడి సూప్, అన్నం కూడా..
మీకు వేడి వేడిగా సూప్ తాగాలి అనిపించినప్పుడు, కెటిల్ లో నీటిని మరిగించి.. సూప్ మిక్స్ వేసి కలిపి తాగితే సరిపోతుంది. చాలా తొందరగా అయిపోతుంది. అంతేకాదు.. ఈ కెటిల్ లో అన్నం కూడా చాలా ఈజీగా ఉడికించొచ్చు. సరైన మోతాదులో బియ్యం, నీరు కెటిల్ వేసి ఆన్ చేస్తే.. వేడి వేడిగా అన్నం కూడా ఉడుకుతుంది. కెటిల్ లోని స్టీమ్ సెన్సార్ మీ అన్నం సమానంగా ఉడికేలా చేస్తుంది. ఎక్కువసేపు వేడిగా కూడా ఉంచుతుంది.
4.కాఫీ, హాట్ చాక్లెట్...
మీ ఇంటికి అతిథులు వస్తున్నట్లయితే.. మీరు ఎలక్ట్రిక్ కెటిల్ లో 5 నుంచి 6 మందికి సరిపడా కాఫీ లేదా హాట్ చాక్లెట్ తయారు చేసుకోవచ్చు.
5. వంటకు మాత్రమేకాదు.. సౌందర్య సాధనంగా కూడా వాడొచ్చు....
ఫేషియల్ స్టీమ్
మీకు మెరిసే ముఖం కావాలి కానీ పార్లర్‌కు వెళ్ళడానికి సమయం లేకపోతే, ఎలక్ట్రిక్ కెటిల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కెటిల్‌లో నీటిని వేడి చేసి, దానిని ఫేషియల్ స్టీమింగ్ కోసం ఉపయోగించండి.
బాటిళ్ల స్టెరిలైజేషన్
మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే, వారి ఫీడింగ్ బాటిళ్లను శుభ్రం చేయడానికి కూడా కెటిల్ వాడొచ్చు. అందులో నీటిని మరిగించి.. ఆ నీటితో బాటిల్లు శుభ్రం చేయచ్చు. లేదంటే.. బాటిల్స్ కెటిల్ వేసి నీరు పోసి కాసేపు మరిగించినా సరిపోతుంది.