భూమ్మీద చివరి దేశం ఏదో తెలుసా? ఇక్కడ 23 గంటలు పగలు ఉంటుంది !

First Published | Nov 9, 2024, 5:15 PM IST

భూమ్మీద ఇప్ప‌టికీ అనేక మిస్ట‌రీలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక దేశంలో రోజులో  23 గంట‌లు ప‌గ‌లు ఉంటుంది. ఇది ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉన్నందున భూమిపై ఉన్న చివ‌రి దేశంగా గుర్తింపు పొందింది. ఆ దేశ మ‌రిన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Last Land on Earth

భూమి గుండ్రంగా ఉందని మనందరికీ తెలుసు. ఈ భూమిపై అనేక దేశాలు ఉన్నాయి. ప్రతి దేశం దాని సహజ సౌందర్యంతో అందంగా ఉంటుంది. కొన్ని దేశాలు వాటి చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి చెందితే, మరికొన్ని వాటి సహజ దృశ్యాలకు ప్రసిద్ధి చెందాయి. ప్రపంచంలోని అతిపెద్ద, ధనిక దేశాల గురించి మీరు విని ఉంటారు, కానీ ఈ భూమ్మీద చివరి దేశం ఏమిటో మీకు తెలుసా? ఎందుకు దీనికి గుర్తింపు వచ్చిందో తెలుసా? దీంతో పాటు ఆ దేశ అద్భుతమైన మిస్టరీ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Norways Last Land on Earth

భూమి చివరి దేశం నార్వే. భూమి తన అక్షం మీద తిరిగే ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఈ దేశం ఉండటంతో ఈ గుర్తింపు పొందింది. ఈ దేశం చాలా అందమైన దేశం. కానీ ఇక్కడ రాత్రి ఉండదని చాలా మందికి తెలియదు. ఉత్తర నార్వేలోని హామర్‌ఫెస్ట్ నగరంలో, సూర్యుడు 40 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. అందువల్ల, దీనిని అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం అని కూడా పిలుస్తారు. ఇక్కడ 40 నిమిషాలు మాత్రమే చీకటిగా ఉంటుంది. మిగిలిన 23 గంటల 20 నిమిషాలు ఈ నగరం పగలు గానే ఉంటుంది.

Latest Videos


Norways Last Land on Earth Unique Phenomena

నార్వేకు సంబంధించిన అనేక ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. 23 గంటల పగలు మాత్రమే కాదు.. ఇక్కడ వేసవిలో మంచు కురవడం మరో విశేషం. ఈ దేశంలో చాలా చల్లని వాతావరణం ఉంటుంది. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో వేసవిలో ఉష్ణోగ్రత 45 నుండి 50 డిగ్రీల వరకు ఉంటే నార్వే లో మాత్రం వేసవిలో మంచు కురుస్తుంది. ఈ సమయంలో ఇక్కడ ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలుగా ఉంటుంది. చలికాలంలో, ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 45 డిగ్రీలకు పడిపోతుంది. ఈ పరిస్థితులు ఒక అందమైన, అద్భుతమైన ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టిస్తుంది.

Last Land on Earth Norways Unique Phenomena

మరో విషేశం ఏమిటంటే ఇక్కడ వేసవి కాలంలో రాత్రి ఉండదు. ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉండటం వల్ల, ఇతర దేశాల మాదిరిగా ప్రతిరోజూ పగలు లేదా రాత్రి ఉండదు. బదులుగా ఇక్కడ ఆరు నెలలు పగలు, ఆరు నెలలు రాత్రి ఉంటుంది. చలికాలంలో ఇక్కడ సూర్యుడు ఉదయించడు, అలాగే, వేసవిలో ఇక్కడ సూర్యుడు అస్తమించడు. ఇలాంటి ప్రత్యేకతల కారణంగా ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఈ దేశాన్ని సందర్శించడానికి వస్తారు.

అయితే, ఇక్కడ ఒంటరిగా వెళ్లడం నిషేధించారు. E-69 హైవే భూమి చివరలను నార్వేతో కలుపుతుంది. ఈ రహదారి ప్రపంచంలోని చివరి రహదారి. మీరు అక్కడికి చేరుకున్నప్పుడు, ఎక్కడికి వెళ్లాలో మీకు తెలియదు, ఎందుకంటే ఇక్కడే ప్రపంచం చివరిదిగా ఉంటుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

Norways Last Land on Earth Unique Phenomena and Travel Restrictions

నార్వేలో మీరు ఈ హైవేలో ఒంటరిగా ప్రయాణించాలనుకుంటే కుదరదు. ఇక్కడ ఒంటరిగా వెళ్లడం నిషేధించారు. ఇక్కడ, ఒక పెద్ద సమూహం మాత్రమే వెళ్లడానికి అనుమతి ఉంది. ఎవరూ ఒంటరిగా వెళ్లడానికి లేదా ఈ రహదారిపై ఒంటరిగా వాహనం నడపడానికి అనుమతించబడరు. ఇక్కడ ప్రతిచోటా మంచు ఉంటుంది, కాబట్టి ఒంటరిగా ప్రయాణించడం వల్ల దారి తప్పిపోయే అవకాశం ఉండటం వల్ల ఒంటరి ప్రయాణాలు నిషేధించారు.

ఈ ప్రదేశంలో సూర్యాస్తమయం, అరోరా బొరియాలిస్ (ధ్రువకాంతి) చూడటానికి చాలా అందంగా ఉండటంతో పాటు మీకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ చేపల వ్యాపారం ఉండేదని చెబుతారు, కానీ క్రమంగా దేశం అభివృద్ధి చెంది, పర్యాటకులు ఇక్కడికి రావడం ప్రారంభించారు. ఇప్పుడు పర్యాటకులు ఇక్కడ బస చేయడానికి హోటళ్లు, రెస్టారెంట్ల వసతిని కల్పిస్తున్నాయి. 

click me!