రూపాయి ఖర్చు లేకుండా వాషింగ్ మెషిన్ ను ఎలా క్లీన్ చేయాలో తెలుసా?

First Published | Nov 9, 2024, 4:12 PM IST

వాషింగ్ మెషిన్ లో మనం రెండు రోజులకోసారి, మూడు రోజులకోసారి ఖచ్చితంగా దుస్తులను వాష్ చేస్తుంటాం. మీ మెషిన్ ఎక్కువ రోజులు ఎలాంటి రిపేర్ రాకుండా పనిచేయాలంటే మాత్రం ఖచ్చితంగా వాషింగ్ మెషిన్ ను క్లీన్ చేయాలి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

వాషింగ్ మెషిన్ శుభ్రపరిచే చిట్కాలు

ఒకప్పుడు ఒక్కరి ఇద్దరి ఇంట్లోనే వాషింగ్ మెషిన్స్ ఉండేవి. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఒక వాషింగ్ మెషిన్ ఉంటుంది. నిజానికి వాషింగ్ మెషిన్ అత్యవసరమైన వస్తువుల్లో ఒకటిగా మారిపోయింది.

ఒకప్పటిలా చేతులతో బట్టలు ఉతికే వారు చాలా తక్కువయ్యారు. ఇప్పుడు వాషింగ్ మెషిన్ లేకుండా బట్టలను ఉతికలేని పరిస్థితి వచ్చింది.

వాషింగ్ మెషిన్ శుభ్రపరిచే చిట్కాలు

వాషింగ్ మెషిన్ లో బట్టలు చాలా తొందరగా, ఈజీగా తెల్లబడతాయి. బట్టలకున్న మురికి మొత్తం పోతుంది. అలాగే మంచి సువాసన కూడా వస్తుంటుంది. కానీ మీ వాషింగ్ మెషిన్ చాలా రోజులు పనిచేయాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా దానిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం అవసరం. 

కానీ చాలా మంది బట్టలను దాంట్లో ఉతుకుతారు కానీ.. దానిని మాత్రం క్లీన్ అసలే చేయరు. దీనివల్ల వాషింగ్ మెషిన్ నుంచి దుర్వాసన రావడమే కాకుండా.. బట్టలు కూడా సరిగ్గా శుభ్రం కావు. 

ముఖ్యంగా క్లీన్ చేయకపోవడం వల్ల వాషింగ్ తొందరగా పాడవుతుంది. దీన్ని రిపేర్ చేయించినా ఎక్కువ కాలం రావు. 

Latest Videos


వాషింగ్ మెషిన్ శుభ్రపరిచే చిట్కాలు

అయితే చాలా మందికి వాషింగ్ మెషిన్ ను శుభ్రం చేయడం రాదు. ఇంకొందరు దీన్ని క్లీన్ చేయడం చాలా కష్టమైన పనిగా భావిస్తారు. కానీ కొన్ని చిట్కాలతో మీరు వాషింగ్ మెషిన్ ను చాలా సులువుగా క్లీన్ చేయొచ్చు. 

దీనికి మీరు వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరమే లేదు. రూపాయి ఖర్చు లేకుండా మీ ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో మీరు చాలా సులువుగా వాషింగ్ మెషిన్ ను క్లీన్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

వాషింగ్ మెషిన్ శుభ్రపరిచే చిట్కాలు

వాషింగ్ మెషిన్‌ను సులభంగా శుభ్రం చేయడం ఎలా?

వినెగర్ & బేకింగ్ సోడా

వెనిగర్, బేకింగ్ సోడాతో కూడా మీరు వాషింగ్ మెషిన్ ను చాలా సులువుగా క్లీన్ చేయొచ్చు. ఈ రెండింటిని ఉపయోగించి మీరు  వాషింగ్ మెషిన్‌లో పేరుకుపోయిన మురికిని చాలా సులువుగా తొలగించొచ్చు. ఇందుకోసం రెండు కప్పుల వినెగర్‌ను తీసుకుని దాన్ని వాషింగ్ మెషిన్ డ్రమ్‌లో పోయండి. 

ఇప్పుడు హై  స్పీడ్‌లో ఒకసారి వాషింగ్ మెషిన్ ను సెట్ చేయండి. ఆ తర్వాత దాంట్లో అర కప్పు బేకింగ్ సోడాను వేసి మళ్లీ అలాగే చేయండి. ఈ బేకింగ్ సోడా, వినెగర్ లు వాషింగ్ మెషిన్ లోపలుండే మురికిని, బ్యాక్టీరియాను తొలగిస్తుంది. 

వేడి నీళ్లు

వేడినీళ్లను ఉపయోగించి కూడా వాషింగ్ మెషిన్ ను శుభ్రం చేయొచ్చు. ఇందుకోసం వేడి నీళ్లలో కొంచెం క్లీనింగ్ పౌడర్ ను కలిపి వాషింగ్ మెషిన్ లో పోయండి. ఒకసారి మెషిన్‌ను శుభ్రం చేసే ప్రోగ్రామ్ ను ఆన్ చేయండి. ఇలా చేయడం వల్ల వాషింగ్ మెషిన్‌లో పేరుకుపోయిన మొండి మురికి చాలా సులువుగా తొలగిపోతుంది. 

వాషింగ్ మెషిన్ శుభ్రపరిచే చిట్కాలు

హైడ్రోజన్ పెరాక్సైడ్

హైడ్రోజన్ పెరాక్సైడ్‌ తో కూడా మీరు వాషింగ్ మెషిన్ ను చాలా సులువుగా క్లీన్ చేయొచ్చు. ఇందుకోసం దీన్ని నీళ్లలో కలిపి దాంట్లో శుభ్రమైన గుడ్డను ముంచి వాషింగ్ మెషిన్ బయటి, లోపలి భాగాలను బాగా శుభ్రం చేయండి. దీనివల్ల గ్రీజు, నాచు, ఉప్పు నీరు, మురికి వంటివన్నీ తొలగిపోతాయి. 

click me!