చాలామంది అమ్మాయిలు సింపుల్ గా, క్యూట్ గా కనిపించాలని కోరుకుంటారు అచ్చం మన నిత్యామీనన్ లా. తన సహజ నటన, సౌందర్యంతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తుంది ఈ ముద్దుగుమ్మ. నిత్యా.. చాలా సింపుల్ గా, క్యూట్ గా, స్టైలిష్ గా ఉంటారు. మరి ఆ స్టైలిష్ చిట్కాలను మీరు ఒకసారి ట్రై చేయండి.
నిత్యామీనన్ సింపుల్ గా, అందంగా ఉండే డ్రెస్సులను ఎంచుకుంటుంది. అవి ఆమె అందాన్ని మరింత పెంచేలా ఉంటాయి. వాటికి తగ్గ సింపుల్ జ్యూలరీ పెట్టుకుంటుంది. మీరు ఇలా ట్రై చేయండి. సింపుల్ లుక్ లో అదిరిపోతారు.
27
సంప్రదాయంగా
నిత్యామీనన్ ఎప్పుడూ కంఫర్ట్ గా ఉండే దుస్తులను వేసుకుంటుంది. అవి సంప్రదాయంగా ఉంటాయి. అందంగానూ ఉంటాయి. నిత్యా చీరలో ఎంత అందంగా ఉంటుందో.. మోడర్న్ డ్రెస్సులోనూ అంతే సౌందర్యంగా కనబడుతుంది. ఇవి ఆమె లుక్ ను మరింత ఎలివేట్ చేస్తాయి.
37
కంఫర్ట్ ముఖ్యం
డ్రెస్సులు వేసుకునేటప్పుడు కంఫర్ట్ చాలా ముఖ్యం. నిత్యా మీనన్ కంఫర్ట్ కు బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. దీని గురించి ఆమె చాలాసార్లు మాట్లారు కూడా. ఎప్పుడైనా కంఫర్ట్ గా ఉండే ఔట్ ఫిట్ లనే ఎంచుకోవాలని ఆమె తరచూ చెబుతుంటారు.
47
జ్యూలరీ
నిత్య మీనన్ దుస్తులతో పాటు జ్యూలరీపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. చక్కని లుక్ కోసం నిత్యా తరచూ నార్మల్ జ్యూలరీనే ధరిస్తారు. అవి ఔట్ ఫిట్ ను డామినేట్ చేయకుండా జాగ్రత్త పడుతారు.
57
నాచురల్ బ్యూటీ
నిత్యామీనన్ స్టైలింగ్‌లో ముఖ్యమైన అంశం ఆమె సహజ సౌందర్యం. నిత్య ఎక్కువ మేకప్ వేసుకోరు. దీంతో ఆమె సహజంగా, అందంగా కనబడతారు.
67
కొన్ని కలర్స్
కొన్ని కలర్స్ మనం బాగా కనిపించడానికి దోహదం చేస్తాయి. అలాంటి రంగుల డ్రెస్సులు నిత్యా ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటారు. అవి మనలో నూతన ఉత్సాహాన్ని నింపుతాయని నిత్యా నమ్ముతూ ఉంటారు.
77
ఆత్మవిశ్వాసం ముఖ్యం:
ఏదైనా దుస్తులను స్టైల్ చేయడానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ముఖ్యం. మీరు ఏది ధరించినా నమ్మకంగా ఉండటం మీలోనే ఉంటుంది.