సాధారణంగా మొటిమల సమస్య నూనె, చనిపోయిన చర్మ కణాలు, హార్మోన్లు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి వాటి వల్ల వస్తుంది.
మానసిక ఒత్తిడి: మానసిక ఒత్తిడి మొటిమలను మరింత తీవ్రతరం చేస్తుంది. ఉదాహరణకు, మీరు ఎక్కువ భయం, ఆందోళన, ఒత్తిడికి గురైనప్పుడు, ఒత్తిడి హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల మొటిమలు పెరుగుతాయి.
శారీరక ఒత్తిడి: మీ శరీరంలో కలిగే శారీరక ఒత్తిడి హార్మోన్ల మార్పులు, బలహీనమైన రోగనిరోధక శక్తి, మంటను కలిగిస్తుంది. ఇవన్నీ మొటిమలు రావడానికి కారణం అవుతాయి.