Nita Ambani: అంబానీ భార్య ధరించిన ఒక చిన్న పిన్ ధర రూ.15కోట్లు.. అందులో అంత స్పెషల్ ఏముంది?

Published : Nov 17, 2026, 10:23 AM IST

Nita Ambani: ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఆమె ధరించే దుస్తులు, నగలకు విపరీతమైన క్రేజ్ ఉంది. తాజాగా ఆమె.. తన డ్రెస్ కి ధరించిన ఓ చిన్న పిన్ ధర వెంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.

PREV
13
ఒక్క చిన్న పిన్ ధర రూ.15 కోట్లా..?

అంబానీ కుటుంబం అంటేనే లగ్జరీకి, అరుదైన కళాఖండాలకు చిరునామా. తాజాగా రియలన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ ధరించిన ఒక చిన్న బ్రోచ్( దుస్తులకు పెట్టుకునే పిన్) ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి పిన్స్ మహా అంటే... వందల్లో లేదంటే వేలల్లో ఉంటుంది. కానీ, నీతా అంబానీ తన డ్రెస్ కి ధరించిన పిన్ ధర మాత్రం ఏకంగా రూ.15కోట్లు కావడం విశేషం. తూనీగ ఆకారంలో ఉన్న ఈ పిన్ తయారు చేయడానికి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పదేళ్ల సమయం పట్టింది అంటే నమ్ముతారా? ఆ పిన్ లో ఉన్న ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం...

23
పిన్ తయారీకి పదేళ్ల శ్రమ...

ముంబయిలోని నీతా అంబానీ కల్చరల్ సెంటర్ లో కొత్తగా ప్రారంభించిన ‘ ది లైబ్రరీ’ వేడుకలో నీతా అంబానీ ఈ అరుదైన బ్రోచ్ ని ధరించారు. దీని పేరు సోరింగ్ స్పిరిట్. ప్రపంచ ప్రఖ్యాత చైనీస్ జ్యూవెలరీ ఆర్టిస్ట్ వాలెస్ చాన్ ఈ అద్భుతమైన పిన్ ని తయారు చేశారు. దీనిని తయారు చేయడానికి ఆయనకు దాదాపు పదేళ్ల సమయం పట్టడం విశేషం.

ఈ పిన్ కి అంత ధర ఎందుకు..? అందులో ఉన్న స్పెషల్ ఏంటి?

ఈ చిన్న తూనీగ పిన్ లో ప్రపంచంలోనే అత్యంత అరుదైన, విలువైన రత్నాలను ఉపయోగించారు. తూనీగ మధ్య భాగంలో మెరిసే ఆకుపచ్చని 17.67 క్యారెట్ల అరుదైన సవోరైట్ గార్నెట్ రత్నాన్ని పొదిగారు. దీని చుట్టూ పసుపు రంగు వజ్రాలు, ఫ్యాన్సీ కలర్ డైమండ్స్, కెంపులు, గులాబీ రంగు రాళ్లు అమర్చారు.

దీనిని నార్మల్ పిన్ లా కాకుండా, దీనిని అత్యం తేలికైన, ఫ్లెక్సిబుల్ టైటానియం లోహంతో తయారు చేశారు. దీని వల్ల నీతా అంబానీ నడుస్తున్నప్పుడు, కదులుతున్నప్పుడు ఈ తూనీగ కూడా నిజమైన తూనీగలాగే కదులుతూ కనిపిస్తుంది. నిజంగా ఓ అందమైన తూనీగ వచ్చి వాలినట్లు కనపడుతుంది.

33
తూనీగ రెక్కల వెనక ఫిలాసఫీ...

వాలెస్ చాన్ ఈ తూనీగ రెక్కలను గణిత శాస్త్రంలో లెక్కలు వేసే 'అబాకస్' (Abacus) ఆకారం స్ఫూర్తితో తీర్చిదిద్దారు. తూనీగ గాలిలో ఎగిరేటప్పుడు సమయాన్ని, వేగాన్ని, చుట్టుపక్కల వాతావరణాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందుకు సాగుతుంది. మనిషి కూడా ప్రకృతితో మమేకమై, ఎలాంటి అడ్డంకులనైనా దాటుకుంటూ స్వేచ్ఛగా, అపరిమితమైన అవకాశాలతో ముందుకు సాగాలనే గొప్ప సందేశానికి ఈ బ్రోచ్ ప్రతీకగా నిలుస్తుంది.

పిన్ తో రాయల్ లుక్....

రూ.15కోట్ల కళాఖండం ప్రత్యేకంగా హైలెట్ కావడం కోసం నీతా అంబానీ చాలా సింపుల్, క్లాసీ అవుట్ ఫిట్ ని ఎంచుకున్నారు. లేత రంగు లినెన్ ప్యాంట్ సూట్ పై ఎడమ భుజం వద్ద ఈ తూనీగ బ్రోచ్ ను పెట్టుకోవడంతో అది అందరి కళ్లను కట్టిపడేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories