రాత్రంతా ఫోన్ చూసే వారి ఆలోచనలు అంత భయంకరంగా మారతాయా?

Published : May 20, 2025, 01:44 PM IST

Phone Use Affects: రాత్రంతా నిద్రపోకుండా ఫోన్ చూసేవారు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి. వారి మెదడు ఊహించని సమస్యలను ఎదుర్కొంటుంది. ఇది ఒక సమస్య అని కూడా వారికి తెలియదు. అవేంటి? వాటి నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
ఎక్కువమంది చేసే తప్పు ఇదే..

ఈ రోజుల్లో చాలామంది రాత్రిళ్లు నిద్రపోకుండా ఫోన్ చూస్తుంటారు. నిద్ర వచ్చే లోపు కాసేపు చూద్దామని మొదలు పెడతారు. దీంతో నిద్ర ఎగిరిపోతుంది. ఇక రాత్రంతా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు. అయితే దీని వల్ల శరీరానికి, మెదడుకు ఎంతో ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

25
ఫోన్ వల్లే నిద్రకు భంగం..

రాత్రి వేళ ఫోన్ స్క్రీన్ వెలుతురు నేరుగా కళ్లలోకి వచ్చి మెదడుపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా "మెలటోనిన్" అనే నిద్ర హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీని వల్ల నిద్రలేమి సమస్య మొదలవుతుంది. నిద్ర వచ్చే వరకు ఫోన్ చూద్దాం అనుకుంటారు కాని.. ఫోన్ వల్ల నిద్ర చెడిపోతోందని గుర్తించలేరు. ఇదిలాగే కొనసాగితే ఆలోచనల్లో మార్పు వస్తుంది.

35
నేరాలు చేసే ఆలోచనలు వస్తాయి..

మెదడు రిలాక్స్ కాకపోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. పునరుత్పత్తి వ్యవస్థ, హార్మోన్ల సమతుల్యతపై కూడా ప్రభావం చూపుతుంది. ఆలోచనల్లో మార్పు వచ్చి అసహనం పెరుగుతుంది. చిరాకు, కోపం పెరిగి అందరితోనూ గొడవలు స్టార్ట్ అవుతాయి. అయినా రాత్రిళ్లు ఫోన్ చూసే అలవాటు మానుకోకపోతే నేరాలు చేసే ఆలోచనలు కలుగుతాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

45
రీసెర్చ్ రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయంటే..

తాజా అధ్యయనాల ప్రకారం రాత్రిపూట ఫోన్ చూసే వారి టెస్టో స్టెరాన్ స్థాయిలు సగటున 24 శాతం తగ్గుతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. కాలిఫోర్నియాలో జరిగిన ఓ రీసెర్చ్ ప్రకారం రాత్రి వెలుతురులో ఎక్కువ సమయం గడిపే యువతలో నిద్రలేమి, మానసిక ఆందోళనలు, లక్ష్యంపై ఫోకస్ తగ్గడం వంటి సమస్యలు పెరిగినట్లు తేలింది.

55
ఇలా చేస్తే మేలు..

నిపుణులు ఇచ్చే సూచన ఏంటంటే.. నిద్రపోవడానికి కనీసం 1 గంట ముందు ఫోన్ వాడకాన్ని తగ్గించాలి. ఇక సినిమా చూడాలి లేదా ఏదైనా ప్రోగ్రామ్ చూడాలని ఫిక్స్ అయినప్పుడు రాత్రివేళ లైట్ మోడ్‌ లేదా నైట్ మోడ్‌ ఆన్ చేసుకొని వాడాలి. లేదంటే "బ్లూ లైట్" ఫిల్టర్‌ గ్లాసులు వాడినా మంచిదే. ఇవి పాటిస్తే మెదడుపై ఒత్తిడి తగ్గి, నిద్ర నాణ్యత మెరుగవుతుంది. మెదడు ఆరోగ్యంగా ఉంటేనే జీవితం సాఫీగా సాగుతుందని వైద్యులు చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories