కష్ట సమయాల్లో ఆదుకునేది కుటుంబం, బంధువులు, స్నేహితులు, ఆత్మీయులే. కాబట్టి మీరు పరిచయస్తులు లేని, సహాయాన్ని చేసేవారు లేని చోట ఎప్పుడూ నివసించకూడదు. కష్ట సమయాల్లో అలాంటి ప్రదేశం నరకంలా అనిపిస్తుంది. అలాగే విద్య, జ్ఞాన సముపార్జన ఎంతో ముఖ్యం. ఎక్కడైతే చదువుకోవడానికి వీలు ఉండదో అక్కడ ఉండకూడదు. ఒక మనిషికి చదువు చాలా ముఖ్యం.