Plastic Bottle: ప్లాస్టిక్ బాటిల్‍లో నీళ్లు తాగుతున్నారా? అవి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయో తెలుసా?

Published : Mar 18, 2026, 07:18 PM IST

Plastic Bottle: ప్యాక్ చేసిన డ్రింకింగ్ వాటర్ బాటిళ్లపై 2 ఏళ్ల వరకు గడువు ఉంటుంది. అలా ఉన్నంత మాత్రాన అవి ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. ఎందుకంటే ఆ నీరు ఉండేది ప్లాస్టిస్ బాటిల్‍లో. మరి అన్నేళ్లు నీరు అదే సీసాలో ఉంటే ఏమవుతుందో తెలుసా?  

PREV
15
ప్లాస్టిక్ బాటిల్ వాడుతున్నారా..ముందు ఇది తెలుసుకోండి

ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్, ప్లాస్టిక్. యూజ్ అండ్ త్రోకు బాగా పనికొస్తాయి కాబట్టి అవే వాడతారు. కానీ చాలా మంది మాత్రం వాటిని ఏళ్ల తరబడి వాడతారు. కానీ దానివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుసుకోరు. ముఖ్యంగా మనం బయటకొనే వాటర్ బాటిల్స్...చాలా వరకు ప్లాస్టిక్కే. దానిపై 2 ఏళ్ల వరకు గడువు ఉంటుంది. అయితే ఇది నీటి నాణ్యత కంటే ప్లాస్టిక్ బాటిల్ మన్నికపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా అవి ఎలాంటి ప్రాంతంలో ఉంచారన్నది కూడా తెలుసుకోవాలి.

25
ప్లాస్టిక్ సీసాలోని కెమికల్స్ (Chemical Leaching)

మనం తాగే ప్లాస్టిక్ బాటిల్‍ను ఎక్కువగా PET (Polyethylene Terephthalate) ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు. బాటిల్‍ను ఎండలో లేదా వేడి ప్రదేశంలో ఉంచినప్పుడు, ప్లాస్టిక్‌లోని BPA (Bisphenol A), Phthalates వంటి హానికర రసాయనాలు రిలీజ్ అయి నీటిలో కలిసిపోతాయి. బాటిల్ పాతబడే కొద్దీ లేదా పదే పదే వాడటం వల్ల ప్లాస్టిక్ లోపలి పొరలు బలహీనపడి, మైక్రో ప్లాస్టిక్స్ నీటిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. 

35
బాక్టీరియా (Bacterial Growth)

ఒక్కసారి సీసా మూత తీసిన తర్వాత, గాలిలోని బాక్టీరియా లేదా మన నోటి ద్వారా వెళ్లే బాక్టీరియా నీటిలో చేరి వేగంగా వృద్ధి చెందుతాయి. అందుకే సీసా తెరిచిన 24 నుండి 48 గంటల్లోపు ఆ నీటిని తాగేయడం సురక్షితం. కొంతమంది అదే పనిగా నీరు అయిపోయినా మళ్లీ నీరు నింపుకుని తాగుతుంటారు. అది అస్సలు మంచిది కాదు. 

45
ఒకసారి మాత్రమే వాడండి

'యూజ్ అండ్ త్రో' బాటిల్స్ ఒకసారి వాడాక పడేయాల్సిందే. మళ్లీ మళ్లీ వాడకండి. ఇవి కేవలం ఒక్కసారి ఉపయోగించడానికి మాత్రమే డిజైన్ చేశారు. అందుకే వాటికి 'యూజ్ అండ్ త్రో' అన్నారు. ఎక్స్ పెయిరీ అయిపోయాక కూడా ఏదైనా ఎలా పడేస్తామో, ఇది కూడా అంతే. 

55
ఎండ తగిలే చోట ఉంచాలి

ప్లాస్టిస్ సీసాలను ఎప్పుడూ ఫ్రిజ్ లేదా నీడ ఉన్న చోట ఉంచాలి. కార్లలో లేదా ఎండ తగిలే కిటికీల దగ్గర ఉంచకండి. ప్లాస్టిక్ సీసాలకు బదులుగా స్టెయిన్‌లెస్ స్టీల్, గాజు లేదా రాగి సీసాలను వాడటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాపర్ బాటిల్‍ అయితే ఇంకా మంచిది దానివల్ల గొంతును సవరిస్తుంది.

ఇంకో విషయం ప్లాస్టిక్ బాటిల్ అడుగున ఉండే త్రిభుజాకార గుర్తులో '1' అనే నంబర్ ఉంటే అది PET (Polyethylene Terephthalate) అని అర్థం. దీన్ని ఒక్కసారి వాడి పారేయాలి. జాగ్రత్త సుమీ.

Read more Photos on
click me!

Recommended Stories