Washing Machine: వాషింగ్ మెషిన్ లో వీటిని ఉతుకుతున్నారా? మీ మెషిన్ పాడైపోతుంది జాగ్రత్త..!

Published : Apr 02, 2026, 01:38 PM IST

 Washing Machine: వాషింగ్ మెషీన్ ఇంటి పనులను చాలా ఈజీ చేసిందన్న మాట నిజం. కానీ, వాటిలో అన్ని దుస్తులను ఉతకకూడదు. తెలియకుండా కొన్నింటిని ఉతకడం వల్ల ఏకంగా మీ మెషిన్ పాడైపోతుంది జాగ్రత్త 

PREV
14
Washing Machine

ఈ రోజుల్లో అందరి ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంటోంది. చేతులతో దుస్తులు ఉతికేవారు చాలా అరుదు అయిపోయారు అని చెప్పొచ్చు. ఇవి మన జీవితాల్లోకి వచ్చాక పని చాలా సులభమైపోయింది. కానీ.. ఈ మెషిన్ ని జాగ్రత్తగా చూసుకున్నప్పుడే ఎక్కువ కాలం మన్నిక వస్తుంది. అలా కాకుండా.. తెలిసీ తెలియక చేసే కొన్ని తప్పులు ఏకంగా మీ మెషిన్ ని పాడు చేసేస్తాయని మీకు తెలుసా? మరీ ముఖ్యంగా కొన్ని రకాల దుస్తులను వాషింగ్ మెషిన్ లో పొరపాటున కూడా ఉతకకూడదు. వేటిని ఉతకకూడదు? వాటి వల్ల వచ్చే సమస్యలు ఏంటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..

24
స్టోన్ వర్క్ ఉన్న దుస్తులు...

చాలా మంది స్పెషల్ గా తమ దుస్తులను డిజైన్ చేసుకుంటూ ఉంటారు. మరి కొన్ని దుస్తులకు స్టోన్ వర్క్ ఉంటుంది. అలాంటి దుస్తులను వాషింగ్ మెషిన్ లో ఉతకకూడదు. ఇలా చేయడం వల్ల దుస్తులు తొందరగా చిరిగిపోతాయి. దారాలు కూడా ఊడిపోతాయి. అంతేకాదు.. వీటి కారణంగా, వాషింగ్ మెషిన్ కూడా పాడయ్యే అవకాశం ఉంది.

ఉన్ని దుస్తులు..

ఉన్ని దుస్తులు చాలా మృదువుగా ఉంటాయి. కాబట్టి, వాటిని వాషింగ్ మెషిన్ లో ఉతకకూడదు. మెషిన్ లో వేస్తే అవి తొందరగా పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, వాటిని కొద్దిగా సబ్బు ఉపయోగించి.. చేతితో సున్నితంగా ఉతకాలి.

34
రెయిన్ కోట్...

రెయిన్ కోట్ వాటర్ ప్రూఫ్ కాబట్టి.. దానిని వాషింగ్ మెషిన్ లో ఉతకకూడదు. అలా చేయడం వల్ల రెయిన్ కోట్ బెలూన్ లాగా ఉబ్బి, చిరిగిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, వాషింగ్ మెషిన్ కూడా పాడయ్యే ప్రమాదం ఉంది.

నూనె , గ్రీజు మరకలున్న దుస్తులు..

బట్టలకు మరకలు పడటం సాధారణం. అయితే, వంట నూనె, పెట్రోల్, ఆల్కహాల్, మోటార్ గ్రీజు వంటి మరకలున్న బట్టలను వాషింగ్ మెషీన్‌లో ఎప్పుడూ వేయవద్దు. ఇవి మండే స్వభావం కలిగి ఉంటాయి. వాషింగ్ మెషీన్‌లో అగ్ని ప్రమాదానికి కారణం కావచ్చు.

44
లేస్ ఫ్యాబ్రిక్స్

లేస్ వర్క్ ఉన్న దుస్తులు చాలా సున్నితమైనవి. వాటిని వాషింగ్ మెషీన్‌లో వేస్తే, లేస్ పాడైపోయి, ఆ దుస్తుల అందం చెడిపోతుంది. అందువల్ల, వాటిని చేతితో ఉతకడం మంచిది.

ఖరీదైన లోదుస్తులు

చాలా ఖరీదైన, ఆకర్షణీయమైన, అలాగే ప్యాడ్‌లు లేదా అండర్‌వైర్ కలిగిన లో దుస్తులను వాషింగ్ మెషీన్‌లో ఉతకకూడదు. ముఖ్యంగా అండర్‌వైర్ ఉన్న లోదుస్తులను మెషీన్‌లో వేస్తే, వాటి ఆకారం దెబ్బతినే ప్రమాదం ఉంది, అంతేకాకుండా అవి చిరిగిపోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories