Health tips: 'సండే అయినా.. మండే అయినా.. ప్రతిరోజూ తినండి గుడ్లు’ అని టీవీ యాడ్ లలో ప్రతీ రోజూ చూస్తూనే ఉంటాం. గుడ్లు సంపూర్ణ ఆహారం అయినప్పటికీ వీటిని ఎలా తినాలో సరైన మార్గం తెలిసి ఉండాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.అంటే గుడ్డును వేటితో తినాలి.. వేటితో కలిపి తినకూడదు వంటి విషయాలు తెలియాలి. ఎందుకంటే గుడ్డును కొన్ని రకాల ఆహార పదార్థాలతో తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇంతకి ఎలాంటి గుడ్డును వేటితో కలిపి తినకూడదో తెలుసుకుందాం పదండి.
చేపలు (Fish): గుడ్లను, చేపలను కలిపి తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.. ముఖ్యంగా ఉడకబెట్టిన గుడ్లతో చేపలను తినకూడదు. దీని వల్ల స్కిన్ అలర్జీ (Skin allergy)లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
27
జున్ను (Cheese): గుడ్డు, జున్ను రెండింటో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కానీ గుడ్డును, జున్నును రెండింటినీ ఒకేసారి తినడం వల్ల జీర్ణ సమస్యలు (Digestive problems)వస్తాయి, ఎందుకంటే ప్రోటీన్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
37
అరటి పండ్ల (Bananas): అరటి పండ్లను గుడ్లతో లేదా గుడ్లు తిన్న తరువాత ఎన్నడూ తినకూడదు. ఇలా తింటే మలబద్ధకం, గ్యాస్ ,ప్రేగు సంక్రమణకు దారితీస్తుంది.
47
నిమ్మకాయ (Lemon): ఉడకబెట్టిన గుడ్లుపై లేదా ఆమ్లెట్లపై నిమ్మకాయ రసం, ఉల్లిపాయలు వేసుకుని తింటూ ఉంటారు. కానీ గుడ్లతో నిమ్మకాయను తినడం ప్రమాదకరమని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
57
చక్కెర (Sugar): గుడ్లతో చేసిన తీపి ఫ్రెంచ్ టోస్ట్ ను తినడం ఇష్టమైతే ఈ అలవాటును వెంటనే మానుకోవడం మంచిది. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యానికి హానికరం. వాస్తవానికి చక్కెర, గుడ్ల నుంచి వెలువడే అమైనో ఆమ్లాలు మన శరీరానికి విషపూరితమైనవి. ఇవి మన శరీరంలో రక్తం గడ్డకట్టేలా చేస్తాయి.
67
టీ (Tea)): బ్రేక్ ఫాస్ట్ లో చాలా మంది టీతో గుడ్లను తింటూ ఉంటారు. కానీ గుడ్లను టీ తో కలపడం వల్ల ఉదర సమస్యలు వస్తాయి. ఇది మలబద్ధకం, కడుపు నొప్పి, అజీర్ణానికి దారితీస్తుంది.
77
గుడ్లతో పాటు పుచ్చకాయలు (Watermelons), జున్ను (Cheese), పాలు, పాల ఉత్పత్తులు (Dairy products) , బీన్స్ (Beans) కూడా తీసుకోకూడదు. ఇవన్నీ కలిసి శరీరానికి హానిచేస్తాయి.