బరువు తగ్గాలని అనుకోవడంలో తప్పులేదు.. కానీ మీరు అందుకు తగ్గట్టు జాగ్రత్తలు తీసుకుంటున్నారో లేదో చాలా ముఖ్యం. కొన్ని అలవాట్లను అలవర్చుకుంటేనే మీరు ఈజీగా బరువు తగ్గుతారు. లేదంటే మీరేం చేసినా బరువు పెరగడమే కానీ తగ్గడం అనేది జరగదు.
బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా.. బరువు పెరగడమే తప్ప బరువు తగ్గడం లేదా..? అయితే మీరు కొన్ని అలవాట్లను మానుకోవాల్సి ఉంటుంది. అది మీరు బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతతుంది. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల తర్వాత ఈ మూడింటికీ దూరంగా ఉంటేనే మీరు సులభంగా బరువు తగ్గుతారు. అవేంటంటే..
26
టీ, కాఫీ.. సమయంతో అవసరం లేకుండా టీ , కాఫీలను రోజంతా తాగే వారు చాలా మందే ఉన్నారు. టీ, కాఫీని తక్కువ మొత్తంలో తీసుకోవడానికి ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. ఎక్కువ మొత్తంలో తీసుకుంటేనే వీటిలో ఉండే చక్కెర, కెఫిన్ మనల్ని అనారోగ్యంలోకి నెట్టేస్తాయి.
36
పొరపాటున ఈ టీ లేదా కాఫీని నిద్రపోయే ముందు తాగారో మీ నిద్ర దెబ్బతినడమే కాడు మీ వెయిట్ లాస్ ప్రక్రియ కూడా దెబ్బతింటుంది. కాబట్టి టీ, కాఫీలను సాయంత్రం ఆరు తర్వాత ఎట్టి పరిస్థితిలో తాగకండి.
46
పండ్లు తినకూడదు.. పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వీటిని సాయంత్రం వేళల్లో తింటే మాత్రం జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు అలా తినడం వల్ల రక్తంలో షుగరు లెవెల్స్ కూడా పెరుగుతాయట. కాబట్టి పండ్లను సూర్యాస్తమయం తర్వాత తినకండని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
56
రాత్రుళ్లు తినే అలవాటును మానేయాలి.. సమయానికి అన్నం తినడం మంచి అలవాటే కానీ.. మీరు వేళకు నిద్రపోకపోతేనే.. ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రాత్రుళ్లు ఎక్కువ సేపు మెలుకువగా ఉండటం వల్ల రాత్రిళ్లు ఏదైనా తినాలనే కోరిక పుడుతుంది. దాంతో ఆగకుండా ఏది పడితే అది తినేస్తుంటారు.
66
=
దీనివల్ల మీ శరీరంలో అదనపు కేలరీలు చేరిపోయి.. కొవ్వు విపరీతంగా పెరుగుతుంది. దీంతో మీరు మరింత బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాయంత్రం వేళ ఈ అలవాట్లకు వీలైనంత దూరంగా ఉండండి. లేదంటే మీరు మరింత బరువు పెరిగే ప్రమాదముంది.