ఈ గోంగూరతో అనేక రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం గోంగూరను తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
29
గోంగూరలో విటమిన్ ఎ, బి1, బి2, బి3, విటమిన్ సి లతో పాటు క్యాల్షియం, పొటాషియం, పాస్ఫరస్, సోడియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) ఇంకా మరెన్నో పోషకపదార్థాలు (Nutrients) మెండుగా ఉంటాయి.
39
బరువును తగ్గిస్తుంది: గోంగూరలో ఉండే పీచు పదార్థం తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం అయ్యేలా చేసి జీర్ణాశయం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ లను కరిగించి అధిక బరువు (Over weight), ఊబకాయం వంటి సమస్యలను తగ్గిస్తుంది. కనుక బరువు తగ్గాలనుకునే (Weight loss) వారు డైట్ లో గోంగూరను చేర్చుకోవడం మంచిది.
49
కంటి చూపు మెరుగుపడుతుంది: గోంగూరలో ఉండే విటమిన్ ఎ (Vitamin A) కంటి చూపుకు సహాయపడుతుంది. కనుక తరచుగా గోంగూరను ఆహారంలో తీసుకుంటే కంటి సంబంధిత సమస్యలు తగ్గి కంటి చూపు మెరుగుపడుతుంది (Eyesight improves). దీంతో కంటి ఆరోగ్యం మెరుగుపడి రేచీకటి వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
59
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది: గోంగూరలో అధికంగా ఉండే పొటాషియం (Potassium) శరీరంలోని రక్త సరఫరా వ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీంతో శరీరంలోని అన్ని అవయవాలకు రక్త సరఫరా బాగా జరిగి గుండె పోటు, అధిక రక్తపోటు వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే గుండె ఆరోగ్యంగా (Heart health) ఉంటుంది.
69
మధుమేహాన్ని నియంత్రిస్తుంది: మధుమేహంతో బాధపడేవారికి గోంగూర మంచి ఫలితాలను అందిస్తుంది. ఇది రక్తంలోని చక్కెర నిల్వల స్థాయిని తగ్గించి శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను (Insulin levels) పెంచుతుంది. దీంతో మధుమేహాన్ని (Diabetes) నియంత్రణలో ఉంచుతుంది. కనుక మధుమేహంతో బాధపడేవారు తరచూ గోంగూరను తీసుకుంటే మంచిది.
79
క్యాన్సర్ ను నివారిస్తుంది: శరీరంలో క్యాన్సర్ కణాల వ్యాప్తిని అరికట్టి కొన్ని రకాల ప్రాణాంతక క్యాన్సర్లు (Cancers) రాకుండా గోంగూర అడ్డుకుంటాయి. అంతే కాకుండా ఇందులో ఉండే పోలిక్ యాసిడ్స్ (Folic acids) గుండె, కిడ్నీ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతాయి. కనుక తరచుగా గోంగూరను తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.
89
జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది: గోంగూరలో ఉండే సుగుణాలు జుట్టు ఆరోగ్యానికి (Hair health) కూడా సహాయపడతాయి. ఇందుకోసం గోంగూర ఆకులను మెత్తగా పేస్ట్ చేసి తలకు పట్టించి గంట తరువాత తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్యలు తగ్గడంతోపాటు బట్టతల సమస్యలు (Baldness problems) కూడా తగ్గుతాయి. దీంతో జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది.
99
వీటితోపాటు గోంగూరను తీసుకుంటే ఎముకలు, దంతాల ఆరోగ్యం (Dental health) మెరుగుపడుతుంది. అలాగే దగ్గు, ఆయాసం, నిద్రలేమి (Insomnia) వంటి సమస్యలకు దూరంగా ఉంటారు. కనుక ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగిన గోంగూరను ఆహార జీవనశైలిలో చేర్చుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చని వైద్యులు అంటున్నారు.